కెరీర్ ప్రారంభంలో కొన్ని గ్లామర్ చిత్రాల్లో నటించింది అమలా పాల్. అటు తరువాత తెలుగులో ‘బెజవాడ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఈమెకు రాంచరణ్ ‘నాయక్’, అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’, నాని ‘జెండా పై కపిరాజు’ సిద్దార్ద్ ‘లవ్ ఫెయిల్యూర్’ వంటి క్రేజీ సినిమాల్లో నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగా తమిళ డైరెక్టర్ విజయ్ ను పెళ్ళి చేసుకుంది. తరువాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది.
ఇటీవల అమలా పాల్ ‘ఆమె’ అనే చిత్రంలో నటించి వివాదాలు రేపింది. ఇదిలా ఉంటే.. ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… అమలా పాల్ తండ్రి వర్గీస్ పాల్ ఈరోజు మరణించారు. అమలా పాల్ చెన్నై లో షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఈ వార్త తెలిసిందట. వెంటనే ఆమె కేరళ వచ్చినట్టు తెలుస్తుంది.