పండగనాడు యాక్షన్‌ విందు పంచిన అమెజాన్‌ ప్రైమ్‌!

  • October 6, 2022 / 03:50 PM IST

యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఇచ్చే కిక్‌ మిగిలిన సీన్స్‌ ఇవ్వవు అని చెబుతారు. ఎందుకంటే మన ఫేవరెట్‌ మాస్‌ హీరో రౌడీలను ఉతికి ఆరేస్తుంటే.. మనమే కొట్టాం అనేంతలా ఊపు వచ్చేస్తుంది. అలాంటి యాక్షన్‌ సీన్స్‌కు థియేటర్లలో ఈలలు చెవులు చిల్లు పడేలా మోగుతాయి. అలాంటి నాలుగు యాక్షన్‌ సీన్స్‌ ఒకే వీడియోలో ఉంటే.. ఆ వీడియో భలేగా ఉంటుంది కదా. సుమారు పది నిమిషాల వీడియోలో నాలుగు అదిరిపోయే యాక్షన్ సీన్స్‌ గురించే ఇదంతా.

సౌత్‌ సినిమాల్లో ఇటీవల వచ్చిన యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో అదిరిపోయే నాలుగింటితో అమెజాన్‌ ప్రైమ్‌ ఓ వీడియోను రూపొందించి యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది. దీంతో ఆ వీడియోలో వైరల్‌ అయిపోయింది. కారణం ఆ వీడియోలో ఉన్న స్టార్లే. టాలీవుడ్‌ నుండి అల్లు అర్జున్‌, మహేష్‌బాబు ఆ వీడియలో ఉంటే.. కోలీవుడ్‌ నుండి కార్తి కనిపిస్తాడు. ఇక మలయాళ పరిశ్రమ నుండి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను ఆ వీడియోలో చూసి ఎంజాయ్‌ చేయొచ్చు. అదేనండీ వారి ఫైట్స్‌ చూసి.

అమెజాన్‌ ప్రైమ్‌ అని చెప్పేశాం కాబట్టి.. ఏయే సినిమాల ఫైట్లు ఆ వీడియలో ఉన్నాయో ఈపాటికే మీకు ఓ ఐడియా వచ్చి ఉంటుంది. అయినా ఓసారి చూద్ఆం. అల్లు అర్జున్‌ను స్టైలిష్‌ స్టార్‌ నుండి ఐకాన్‌ స్టార్‌గా మార్చి ఆ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ను చేసిన సినిమా ‘పుష్ప2. ఈ సినిమాలో అడవిలో అల్లు అర్జున్‌ చేసే ఫైట్‌ ఒకటుంటుంది. జక్కా రెడ్డిని కాపడటానికి బైక్‌ మీద దూసుకొచ్చి, తలకు క్లాత్‌ కట్టేసున్నా.. అదగొడతాడు. ఆ ఫైట్‌ను ఈ వీడియోలో చూడొచ్చు.

ఇక మహేష్‌బాబు సినిమా అంటే ‘సర్కారు వారి పాట’ సినిమా నుండే. ఈ సినిమాలో బీచ్‌లో ఓ ఫైట్‌ ఉంటుంది. మహేష్‌ కోసమే డిజైన్‌ చేసినట్లుండే ఆ స్టైలిష్‌ ఫైట్‌ను కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ రెండూ కాకుండా వచ్చే ఫైట్లు ‘కడువా’, ‘విరుమన్‌’ నుండి. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ చేసిన రీసెంట్‌ మలయాళ సినిమానే ‘కడువా’. ఇక ‘విరుమన్‌’తో కార్తి కూడా ఈ వీడియోలో కనిపిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం ఆ యాక్షన్‌ చూసేయండి. ఎంజాయ్‌ చేయండి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus