Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

ఉగాది పర్వదినాన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అదిరిపోయే కంటెంట్‌ను వీక్షకులకు పరిచయం చేసింది. ఈ ఏడాది వారి ప్లాట్‌ఫామ్‌ మీద స్ట్రీమ్‌ అవ్వబోయే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలను పెద్ద ఈవెంట్‌ పెట్టి మరీ ప్రకటించింది. దాదాపు 55కు పైగా ఒరిజినల్ సిరీస్, సినిమాలు ఇందులో ఉన్నాయి. దేశంలోని ప్రధాన భాషలకు సంబంధించిన కంటెంట్‌ వివరాలు వెల్లడించింది.

Amazon Prime

తెలుగులో ఇవీ..
* తమడా మీడియా నిర్మాణంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో ‘ఇసకపట్నం’ అనే వెబ్‌ సిరీస్‌ రూపొందుతోంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ఓ పోర్టుపై నాయుడు అనే వ్యక్తి చేసే పనులు, వారిని ఎదిరించే క్రమం జరిగిన ఘటనలు చెబుతారు.
* యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అదే ‘గువ్వల చెరువు ఘాట్’. దీనిని అమెజాన్‌ ప్రైమ్‌ తెరకెక్కిస్తోంది.
* యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ‘గల్లీ’ అనే సినిమా రూపొందుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘బాహుబలి’ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా నిర్మిస్తోంది.
* నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ రెండో సీజన్‌ కూడా సిద్ధమవుతోంది. ఇక ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో ‘జగమే సంగీతం’ సిరీస్‌కు పల్నాటి సూర్య ప్రతాప్ డైరక్టర్‌.
* యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్’ రియాల్టీ షో తెలుగులోనూ రానుంది. ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు.

ఇతర భాషలు చూస్తే..
* పార్వతి తిరువోతు, అలయా ప్రధాన పాత్రల్లో ‘స్ట్రామ్’ రూపొందుతోంది. వెబ్ సిరీస్‌కు అజిత్ పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
* రాశీఖన్నా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘లుఖే’. హిమాంక్ గౌర్ దర్శకత్వం వహిస్తున్న సిరీస్‌ ఇది.
* మనీష్ పాల్, అంగిరా ధర్ కీలకపాత్రల్లో శశాంక్ బాలి ‘రాపూ’ని తెరకెక్కిస్తున్నారు.
* గేర్ పల్టీ కిస్మత్ – పూరవ్ ఝా, నమన్ జైన్, సాకిబ్ నజర్ కీలకపాత్రల్లో ‘కర్నామే బద్లా’ని వినయ్ వైకుల్ రూపొందిస్తున్నారు.
* సౌరభ్ భావే దర్శకత్వంలో రవి కిషన్, ఆదిత్య రావల్, అశ్వినీ భావే ప్రధాన పాత్రల్లో ‘ది ట్యాక్స్ డిపార్ట్‌మెంట్’ రూపొందుతోంది.
* అలాగే ‘ది రివల్యూషనరీస్’, విజయ్ వర్మ ‘మట్కా కింగ్’, తొలి హిందీ స్వదేశీ సూపర్ హీరో సిరీస్ ‘వంశ్’ లాంటివి కూడా ఉన్నాయి.
* ‘ఫర్టీ’ సీజన్ 2, ‘పంచాయత్’ సీజన్ 5, ‘కాల్ మీ బే’ సీజన్ 2, ‘దహాద్’ సీజన్ 2, ‘గ్రామ్ చికిత్సాలయ్’ సీజన్ 2, ‘సప్నే Vs ఎవ్రీవన్’ సీజన్ 2, ‘సందీప్’ భయ్యా సీజన్ 2, ‘ది ట్రైటర్స్’ సీజన్ 2, ‘వదంది’ సీజన్‌ 2, లాంటి సీక్వెల్‌ సిరీస్‌లు కూడా ఈ లిస్ట్‌ ఉన్నాయి.
* కార్తిక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో ‘నాగ్జిల్లా’ సినిమాను మృగదీప్ సింగ్ లంబా రూపొందిస్తున్నారు. థియేటర్లలోకి వచ్చాక.. ఓటీటీకి వస్తుందీ సినిమా.
* సిద్దార్థ్ మల్హోత్రా, తమన్నా ప్రధాన పాత్రల్లో ‘వ్వాన్ : ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా కూడా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీకి వస్తుంది..

తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags