Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 21, 2026 / 11:12 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఎంసీ హరి, శశిధర్, మనోజ్ (Hero)
  • వేద జలంధర్ (Heroine)
  • రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు (Cast)
  • రమణ రెడ్డి సోమ (Director)
  • మాధవి రెడ్డి సోమ (Producer)
  • స్మరణ్ సాయి (Music)
  • ఎస్ వి కె (Cinematography)
  • రోహిత్ పెనుమత్స (Editor)
  • Release Date : 21st ఆగస్టు 2026
  • అవ్వల్ నెంబర్ ప్రొడక్షన్స్ (Banner)

దగ్గుబాటి రానా ఓ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అంటే.. ఆ సినిమాలో కచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో ఉంది. గతంలో రానా రిలీజ్ చేసిన కేరాఫ్ కంచెరపాలెం కానీ, 35 కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అమీర్ లోగ్ అనే చిత్రాన్ని తన స్పిరిట్ మీడియా సంస్థ పై రిలీజ్ చేస్తున్నాడు రానా. అతని బ్రాండ్ తో ఈ సినిమా ఆడియన్స్ అటెన్షన్ పొందింది. మరి సినిమా ఎంత వరకు ఆకట్టుకుంది అనేది తెలుసుకుందాం రండి:

Ameer Log Movie Review

Ameer Log Movie Review And Rating

కథ: శ్రీను(ఎంసీ హరి) మల్లేష్(శశిధర్ కోచర్లకోట) రఫీక్( మనోజ్ ఆవుల) బెస్ట్ ఫ్రెండ్స్. ఓల్డ్ సిటీలో ఈ ముగ్గురూ ఎటువంటి బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. వీరి కుటుంబీకులు సైతం వీళ్ళ భవిష్యత్తు కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఈ ముగ్గురికీ గీత(వేద జలంధర్) అనే మంచి స్నేహితురాలు ఉంటుంది. ఈమెను ఆ ముగ్గురూ సొంత అక్కగా భావిస్తూ ఉంటారు. ఈ ముగ్గురితో ఆమె బీర్లు తాగుతూ మజా చేస్తుంటుంది. గీత ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంది. మరోవైపు శ్రీను, మల్లేష్, రఫీక్..లకి ఆ ఏరియా పెద్ద అయినటువంటి చాచతో(విశేశ్వర్ రెడ్డి) మంచి పరిచయం ఉంటుంది.

ఒకరోజు చాచ ఏదొక పనిచేసి సొంతంగా సంపాదిస్తే కుటుంబంలోనూ, సంఘంలోనూ మర్యాద ఉంటుంది అని చెబుతాడు. చాచ మాటల్ని సీరియస్ గా తీసుకున్న శ్రీను .. గీత సాయంతో ఆమె కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేరతాడు. అతన్ని చూసి మంచిగా మారి మల్లేష్ క్యాబ్ నడుపుతాడు, రఫీక్ ఒక మెకానిక్ షెడ్ పెట్టుకుంటాడు. ఒకరోజు శ్రీను కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయిస్ తో కలిసి తమ గల్లీ పొరోళ్ళతో క్రికెట్ ఆడి గెలవమని పందెం కడతాడు. మరి ఆ పందెంలో శ్రీను అండ్ టీం గెలిచిందా? ఆ తర్వాత వీళ్ళు బిర్యానీ షాప్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? రవి(రవణ్ నిట్టూరు) వల్ల శ్రీను అండ్ ఫ్రెండ్స్ కి జరిగిన అన్యాయం ఏంటి? చివరికి వీరి జీవితాలు ఏమయ్యాయి అనేది మిగిలిన కథ.

Ameer Log Movie Review And Rating

నటీనటుల పనితీరు: వేద జలంధర్ గీత పాత్రలో బాగా చేసింది. మొన్నామధ్య వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడి మెప్పించిన ఈమె .. అమీర్ లోగ్ సినిమాకి వచ్చేసరికి పూర్తిగా తెలంగాణ అమ్మాయిలా మారి సర్ప్రైజ్ చేసింది. అంతేకాదు కార్పొరేట్ ఎంప్లాయ్ గా చాలా పాష్ గా కూడా కనిపించింది. ఇందులో భాగంగా స్మోకింగ్ ఎపిసోడ్స్ లో, అలాగే బీర్లు తాగుతూ బోల్డ్ గా కూడా కనిపించింది అని చెప్పాలి. శ్రీను పాత్ర చేసిన ఎంసీ హరి బాగా చేశాడు. ఇతని పాత్ర వల్లే కథ మలుపులు తిరుగుతూ ఉంటుంది. మనోజ్, శశిధర్ బాగానే చేశారు కానీ.. వీళ్ళకి ఎందుకో ఎక్కువ క్లోజప్ షాట్స్ వేయలేదు. గీత లవర్ గా రవణ్ నిట్టూరు బాగానే చేశాడు. చాచ పాత్ర రూపంలో విశ్వేశ్వర్ రెడ్డికి చాలా రోజుల తర్వాత నిడివి ఎక్కువగల పాత్ర లభించింది అని చెప్పాలి. మిగతా నటీనటుల పాత్రలు అంతగా రిజిస్టర్ కావు.

Ameer Log Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: హైదరాబాదీ అంటే ఓల్డ్ సిటీ(పాత బస్తీ) బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఒక్కడు నుండీ చూసుకుంటే ఇటీవల వచ్చిన దీవానా వంటి హిట్ సినిమాలు హైదరాబాదీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే. పాత బస్తీ అనగానే అక్కడ ఎక్కువ శాతం జనాలు ఉర్దూ మాట్లాడతారు. కానీ ఆ సినిమాల్లో అక్కడక్కడ ఉర్దూ టచ్ ఇస్తూ.. కామన్ ఆడియన్స్..ని ఇబ్బంది పెట్టకుండా ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ ఈ ‘అమీర్ లోగ్’ విషయానికి వస్తే ఎక్కువ శాతం ఉర్దూ టచ్ ఉంటుంది. హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళకి.. అది పెద్ద ఇబ్బందిగా అనిపించదు. కానీ మిగతా ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడానికి టైమ్ పట్టొచ్చు.

అది పక్కన పెడితే.. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్..తోనే మేజర్ పోర్షన్ ఉంటుంది. కొన్ని చోట్ల హ్యూమర్ బాగానే పండింది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో టచ్ చేయలేదు. సెకండాఫ్ లో బిర్యానీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత.. విశ్వేశ్వర్ రెడ్డి పాత్రతో ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సౌండ్ డిజైన్ వంటివి ఈ సినిమాకి ప్రధాన బలాలు అని చెప్పాలి.

Ameer Log Movie Review And Rating

విశ్లేషణ: నేటివిటీ పరంగా అమీర్ లోగ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాకపోతే ఇది అందరి ప్రేక్షకులకు చేరువవుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.

Ameer Log Movie Review And Rating

ఫోకస్ పాయింట్: సిన్సియర్ అటెంప్ట్

రేటింగ్: 2.75/5

Rating

2.75
Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameer Log Movie
  • #Hari munnangi
  • #Madhavi Reddy
  • #Manoj
  • #Ramana Reddy

Reviews

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

12 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version