ఐటెం భామ అవతారం ఎత్తిన అమీషా పటేల్

హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిన రెండు సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ మొదలెట్టింది అమీషా పటేల్. పవన్ కి జంటగా నటించిన బద్రి సినిమానే తెలుగులోమొదటి, చివరి హిట్ అమీషాకి. ఆ తర్వాత మహేశ్ తో చేసిన నాని,ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాలు ఆ హీరోలకే కలిసి రాలేదు. ఇక అమీషా మాటెందుకులెండి.. ఆ లెక్కన బాలయ్యకు జోడీగా నటించిన ‘పరమవీర చక్ర’ ప్రస్తావన అసలే అవసరం లేదు. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే ఎంపికలో లోపమో మరేదైనా కారణమో గానీ ఈ ముంబై అందానికి తెలుగు అంత అచ్చిరాలేదు. అందుకేనేమో ఈసారి ఐటెం భామగా మారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

ఆశిష్‌ రాజ్‌, రుక్సార్‌ మీర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆకతాయి’. రామ్‌ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమీషా ‘ఆహా ఆహా ఆకతాయి’ అంటూ సాగె ప్రత్యేక గీతంలో నర్తిస్తోంది. ‘మర్యాద రామన్న’, ‘బాహుబలి’ వంటి సినిమాలకు సాహిత్యం అందించిన చైతన్య ప్రసాద్ ఈ గీతాన్ని రచించగా జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకర్త. బుధవారం మొదలైన ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజుల పాటు జరుగనుందట. చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన అమీషా బాలీవుడ్ లో బిజీ అయిపోవడం వల్లే టాలీవుడ్ కు దూరమయ్యా అంటూ వయ్యారంగా చెబుతోంది. హీరోయిన్ గా నెగ్గుకురాలేకపోయిన ఈ అమ్మడు ఐటెం భామగా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus