ప్రముఖ టీవీ నటుడు అమిత్ టాండన్ నటి మౌనిరాయ్ పై మండిపడ్డారు. ఆమె ఒక మోసపూరితమైన మహిళ అని.. తనను ఎప్పటికీ క్షమించనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మౌని రాయ్. అమిత్ టాండన్ భార్య రూబీలు మంచి స్నేహితులు. తరచూ పార్టీలకు, ఫంక్షన్ లకు కలిసి వెళ్తుంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండే వీరిమధ్య ఒక్కసారిగా విభేదాలు తలెత్తాయి. అమిత్ భార్య రూబీ దుబాయిలో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినప్పటినుంచి మౌనిరాయ్ ఆమెని పట్టించుకోవడం మానేసింది. తాజాగా ఈ విషయంపై అమిత్ ఓ ఇంటర్వ్యూలోమాట్లాడారు .
తన భార్య రూబీ కష్టకాలంలో ఉన్నప్పుడు మౌనిరాయ్ మొహం చాటేసిందని.. అందులో ఫ్యూచర్ లో ఆమె మొహం చూడాలనుకోవడం లేదని చెప్పారు. మౌనిరాయ్ తన భార్య చాలా నమ్మిందని.. కానీ ఆమె తన మనసు గాయపరిచిందని.. తన భార్యను వాడుకుందని అన్నారు. కానీ రూబీకి మౌనిరాయ్ అవసరం వచ్చిన సమయంలో ఆమె వదిలేసిందని.. ఈ విషయం రూబీని తీవ్రంగా బాధించిందని చెప్పారు. మౌనిరాయ్ చాలా జెన్యూన్ అని అనుకున్నామని.. కానీ తన నిజస్వరూపం బయపడిందని చెప్పుకొచ్చారు.
ఇక జీవితంలో మౌని రాయ్ ని క్షమించనని.. ఒకవేళ ఆమెతో స్నేహం చేస్తే మన బంధం తెగిపోతుందని తన భార్యతో చెప్పిన విషయాన్ని వెల్లడించారు. 2017లో దుబాయ్ వెళ్లిన రూబీ అక్కడ కొంతమంది ప్రభుత్వ అధికారులను బెదిరించినందుకు గానూ దుబాయ్ హెల్త్ అథారిటీ ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెని అరెస్ట్ చేసి పది నెలల పాటు దుబాయ్ అల్ రఫా జైలో పెట్టారు. 2019 జనవరిలో రూబీ తిరిగి ఇండియాకు వచ్చింది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!