స్టైలిష్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది!
- March 17, 2016 / 11:00 AM ISTByFilmy Focus
టాలీవుడ్‌లో ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించింది హీరోయిన్ అమీ జాక్సన్. ఆ తరువాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. తెలుగులో ఆ భామకు పెద్దగా డిమాండ్ లేదనే చెప్పాలి. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్న అమీకి ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ పెద్ద ఆఫర్ వచ్చిం ది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.
‘సరైనోడు’ సినిమా తరువాత బన్నీ, డైరెక్టర్ విక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అమీకు ఛాన్స్ ఇచ్చాడట డైరెక్టర్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేసే అవకాశం ఉండడంతో అమీ జాక్సన్ ఈ ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. అమీకి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాకి అమీ ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















