ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమాలు రిలీజ్ అయ్యి నేటికి ఎన్ని సంవత్సరాలంటే..!

  • October 19, 2022 / 04:26 PM IST

వారం వారం రిలీజ్ అయ్యే సినిమాల కంటే రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోందిప్పుడు.. ఈమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుల సందర్భంగా ‘పోకిరి’, ‘జల్సా’ సినిమాలు వరల్డ్ వైడ్ స్పెషల్ షోలు వేస్తే ఒకదాన్ని మించి ఒకటి రికార్డ్ రేంజ్ లో హంగామా చేశాయి. వాటి తర్వత నటసింహ నందమూరి బాలక ష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ మూవీని 20 సంవత్సరాల సందర్భంగా రీ రిలీజ్ చేస్తే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అలాగే ఆయా హీరోల అభిమానులకి, మూవీ లవర్స్ కి ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. ఓ సినిమా విడుదలై నేటికి ఇన్ని సంవత్సరాలు అయ్యింది అంటే దాని గురించిన మెమరీస్ గుర్తుచేసుకుంటూ ఉంటారు.. అలా ఈరోజు (అక్టోబర్ 18)న రిలీజ్ అయిన సినిమాలేంటో ఓసారి చూద్దాం..

నటరత్న ఎన్టీఆర్, దేవిక జంటగా నటించగా.. వి.మధుసూధన రావు డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ ఫిలిం ‘టాక్సీ రాముడు’ 18/10/1961న విడుదలైంది. ఈ చిత్రం నేటితో 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

యెగానంద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన మాస్ ఎంటర్ టైనర్ ‘వాడే వీడు’ 18/10/1973న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

నటభూషణ శోభన్ బాబు, మంజుల జంటగా.. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద జగపతి బాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శక నిర్మాతగా తెరకెక్కిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఫిలిం ‘మంచి మనుషులు’ చిత్రం 18/10/1974న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

మెగాస్టార్ చిరంజీవి డ్యుయల్ రోల్ చెయ్యగా, దివ్య భారతి, శోభన కథానాయికలుగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో.. బప్పీ లహరి సంగీత సారథ్యంలో వచ్చిన మాస్ మ్యూజికల్ హిట్ ‘రౌడీ అల్లుడు’ 18/10/1991న రిలీజ్ అయింది. 2022 అక్టోబర్ 18 నాటికి 31 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అతిథి’ 2007 అక్టోబర్ 18న విడుదలైంది. నేటికి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యణ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో.. ‘బద్రి’ వచ్చిన చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కిన పవర్ ఫుల్ అండ్ పర్పస్ ఫుల్ ఫిలిం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’.. 2012 అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ నేటికి విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో.. దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ‘రాజా ది గ్రేట్’ 5 సంవత్సరాలు..

రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత నటించగా.. త్రినాధ రావు నక్కిన డైరెక్ట్ చేసిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘హలో గురు ప్రేమ కోసమే’ 2018లో రిలీజ్ అయింది. నేటితో 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటోంది..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus