అప్పటి స్టార్ డైరెక్టర్ వంశీకి.. ఇప్పటి స్టార్ డైరెక్టర్ వంశీ కి మధ్య ఉన్న సిమిలారిటీస్..!

Advertisement

ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండడం సర్వ సాధారణమైన విషయం. అదే విధంగా.. సినీ పరిశ్రమలో కూడా ఒకే పేరు కలిగిన వేరు వేరు సెలబ్రిటీలు ఉండడం కూడా సహజం. సీనియర్ నరేష్- అల్లరి నరేష్, బాలకృష్ణ- బాలయ్య, శ్రీదేవి – శ్రీదేవి విజయ్ కుమార్, అర్జున్- అల్లు అర్జున్, ప్రభు- ప్రభుదేవా… ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఒకే పేరు కలిగి ఉన్నారు. ఈ విషయంలో ప్రేక్షకులకు చాలా వరకు కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్లోనే ఒకే పేరు కలిగిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నారు.

వీళ్ళ మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇంకో విచిత్రం ఏమిటంటే.. వీళ్ళు ఒకే పేరుతో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టారు. ఆ దర్శకులు ఎవరు..? వాళ్ళు ఒకే పేరుతో చేసిన ఆ సినిమా ఏంటి? వాళ్ళు మరెవరో కాదు.. అప్పటి స్టార్ డైరెక్టర్ వంశీ, ఇప్పటి స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ‘శంకరా భరణం’ సినిమాకి అసిస్టెంట్ గా చేసి ఆ తర్వాత ‘మంచు పల్లకి’ ‘లేడీస్ టైలర్’ ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించి స్టార్ ఎదిగారు వంశీ.

ఈయన సినిమాల్లో మంచి గోదావరి అందాలు.. అలాగే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే,వినాలనిపించే పాటలు ఉంటాయి. ఇతను గతంలో ‘మహర్షి’ అనే చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. మన వంశీ పైడిపల్లి కూడా సేమ్. మొదట ‘వర్షం’ ‘భద్ర’ వంటి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. అటు తర్వాత ప్రభాస్ తో ‘మున్నా’ చేసి దర్శకుడిగా మారాడు. ఇతను కూడా ‘మహర్షి’ అనే టైటిల్ తో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇతను తెరకెక్కించే మూవీస్ కూడా చాలా రిచ్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus