సినీ సెలబ్రిటీల సడెన్ మ్యారేజ్ ల వెనుక అసలు కథేంటి?

అప్పట్లో 2012లో ప్రపంచం అంతమైపోతుందని చాలా మంది భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం.. 2012 లో రావాల్సిన యుగాంతం.. 2021 కి పోస్ట్ పోన్ అయ్యిందని చాలా మంది సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. బహుశా ఇదే నిజం అనుకుంటున్నారేమో మన టాలీవుడ్ సెలబ్రిటీలు..! ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇలా పెళ్లిళ్లు చేసుకోవడం ఏంటి? అని కొంత మంది.. తమ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్,దిల్ రాజు(రెండో పెళ్లి).. వంటి వారి పెళ్లిళ్లు కరోనా టైములోనే జరిగాయి. నితిన్, రానా, నిహారిక, వంటి వారు కూడా పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. నిఖిల్, నితిన్ వంటి హీరోలు కరోనా సీజన్ కంటే ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దిల్ రాజు కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఎప్పటి నుండో వార్తలు వచ్చాయి. అయితే రానా కు అలాగే నిహారిక వంటి వారికి కరోనా సీజన్లోనే పెళ్లి మూడొచ్చినట్టు అయ్యింది.ఇప్పుడు కరోనా తీవ్రత ఇంకా పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా వీళ్ళు వెనుకాడడం లేదు. ఆగష్ట్ 8నే రానా పెళ్లి జరుగబోతోంది.. అలాగే నిహారిక ఎంగేజ్మెంట్ కూడా అదే టైములో ఉండబోతుందని తెలుస్తుంది.వీళ్ళు కూడా కరోనాకు భయపడకుండా ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus