Acharya Movie: ఆచార్యలో వారిపై సెటైర్లు వేస్తున్నారా?

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో ఆచార్యపై అంచనాలు భారీగా పెరిగాయి. చిరు, చరణ్ ఈ సినిమాలో నక్సలైట్లుగా కనిపిస్తారని తెలుస్తోంది. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం.

అయితే ఈ సినిమాలో కొరటాల శివ చిరంజీవి చేత రాజకీయ నాయకులపై, పొలిటికల్ సిస్టమ్ పై సెటైర్లు వేయించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఈ మూవీతో చిరంజీవి, చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రిలీజైన లాహే లాహే సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా త్వరలో ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది.

ఈ మూవీలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. రెజీనా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేశారని సమాచారం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఆచార్యపై అంచనాలను అంతకంతకూ పెంచడంలో కొరటాల ఎక్కడా తగ్గడం లేదని సినిమా రిలీజయ్యాక రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం గ్యారంటీ అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus