Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

అల్లు అర్జున్ (Allu Arjun) పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు ఇటీవల చాలా వార్తలు వచ్చాయి. వాటిపై అల్లు అర్జున్ పీఆర్, పర్సనల్ మేనేజర్ అయినటువంటి శరత్ చంద్ర నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఆయన ‘గుర్తుకొస్తున్నాయి’ అనే వెబ్ సిరీస్ తో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై ఆయనకి ప్రశ్న ఎదురైంది?

Allu Arjun

యాంకర్ మాట్లాడుతూ.. ” ఇటీవల అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వెబ్ సైట్స్ లో, అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చర్చలు గట్టిగా జరిగాయి. అల్లు అర్జున్ మామ గారు కూడా అతని పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు కూడా టాక్ వినిపించింది. సరిగ్గా ఇలానే జూనియర్ ఎన్టీఆర్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. అది అవాస్తవం అంటూ వాళ్ళ టీమ్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ అల్లు అర్జున్ (Allu Arjun) గారి పొలిటికల్ ఎంట్రీ న్యూస్..లపై అల్లు అర్జున్ టీమ్ అఫీషియల్ గా ఎందుకు స్పందించి క్లారిటీ ఇవ్వలేదు?” అంటూ ప్రశ్నించాడు.

అందుకు అల్లు అర్జున్ (Allu Arjun) మేనేజర్ అయినటువంటి శరత్ చంద్ర నాయుడు బదులిస్తూ.. ” నేను ఆ టాపిక్ గురించి స్పందించాను. నా సోషల్ మీడియా హ్యాండిల్లో అలా న్యూస్ రాసిన వాళ్లకి.. ‘ అందులో నిజం లేదు’ అని చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. చాలా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అలాంటాయన.. అవన్నీ వదిలేసి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారు? ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. నెక్స్ట్ 10 ఏళ్ళు బన్నీ గారు చాలా బిజీ” అంటూ క్లారిటీ ఇచ్చారు.

‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus