Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర పెద్ద హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. అయితే ఇంత రచ్చలో కూడా నవీన్ పొలిశెట్టి తన కొత్త సినిమాతో చాలా కూల్ గా వస్తున్నారు. అందరూ భారీ బడ్జెట్ టెన్షన్ లో ఉంటే ఈ యంగ్ హీరో మాత్రం పక్కా ప్లాన్ తో సేఫ్ గా బరిలోకి దిగుతున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే పెట్టిన పెట్టుబడిలో ఎక్కువ శాతం వెనక్కి రావడమే ఇక్కడ విశేషం. అందుకే ఈ రాజు గారికి బిజినెస్ పరంగా ఎలాంటి టెన్షన్ లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Anaganaga Oka Raju

నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే సినిమాకు ఇప్పటికే 32 కోట్ల రూపాయలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఓటీటీ హక్కులు 19 కోట్లు కాగా శాటిలైట్, ఆడియో, ఓవర్సీస్ బిజినెస్ అన్నీ కలిపి మరో 13 కోట్ల వరకు వచ్చాయి. ఇలా థియేటర్లలో బొమ్మ పడకముందే మేకర్స్ దాదాపు గట్టెక్కేశారు. ఇప్పుడు ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవడానికి థియేటర్ల నుంచి కేవలం 8 కోట్ల రూపాయల షేర్ రాబడితే సరిపోతుంది.

సంక్రాంతి సెలవుల్లో నవీన్ లాంటి హీరోకి 8 కోట్లు అంటే చాలా చిన్న విషయం. టాక్ కొంచెం బాగున్నా కూడా వారం తిరగకముందే లాభాల్లోకి వెళ్ళిపోవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. గతేడాది వాళ్లు రిలీజ్ చేసిన కొన్ని సినిమాలు అంతగా ఆడలేదు. అందుకే ఈ ఏడాది రాబోయే వరుస సినిమాలకు ఈ రాజు మూవీతో మంచి స్టార్ట్ ఇవ్వాలని నాగవంశీ టీమ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి రిస్క్ లేని బిజినెస్ స్ట్రాటజీతో నవీన్ పొలిశెట్టి అందరికంటే ముందున్నారు. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటే సంక్రాంతి విన్నర్ గా నిలవడం గ్యారెంటీ. మరి ఈ రాజు గారు జనవరి 14న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus