రంగస్థలంలో రంగమ్మగా అనసూయ

‘రంగస్థలం’లో రామ్ చరణ్ కథానాయకుడు, సమంత కథానాయకి అనే విషయం అందరికీ తెలీసిందే. సినిమాలో వీరితోపాటు బోలెడుమంది ఉన్నప్పటికీ.. ఈ సినిమాలో అనసూయ రోల్ ఏమిటనే విషయమే చర్చనీయాంశం అయ్యింది. రామ్ చరణ్ ని వశపరుచుకోవాలని చూసే అమ్మాయి అని కొందరు, చరణ్ కి మేనత్తగా కనిపించనుందని ఇంకొందరు చెబుతూ వచ్చినప్పటికీ.. అనసూయ వాటిని తన ట్విట్టర్ ద్వారా ఖండించడంతో అవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అయితే.. సినిమాలో అనసూయకి రామ్ చరణ్ కి లింక్ ఏమిటనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ ఆ క్యారెక్టర్ ఏమిటనే విషయంలో మాత్రం చిన్న అప్డేట్ వచ్చింది.

అనసూయ “రంగస్థలం” చిత్రంలో రంగమ్మ అనే పల్లెటూరి పడుచుగా కనిపించనుంది. వెస్ట్ గోదావరి స్లాంగ్ లో రంగమ్మ పాత్రలో అనసూయ సంభాషణలు, ఆమె ఒలికించే హొయలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సుకుమార్ శిష్యబృందం చెబుతోంది. ఇకపోతే.. రేపు విడుదలవ్వనున్న “రంగస్థలం” టీజర్ లో కూడా అనసూయ క్యారెక్టర్ గ్లింప్స్ ఉండబోతోందని వినికిడి. చూస్తుంటే.. “రంగమ్మ”గా అనసూయ రాణించి భవిష్యత్ లో బోలెడన్ని క్యారెక్టర్స్ క్యాష్ చేసుకొనేలా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus