2016 లో అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ అంటూ సంక్రాంతి బరిలో దిగారు. కొడితే దెబ్బకు బాక్సాఫీస్ బద్ధలైపోయింది. ఆ సంక్రాంతి విన్నర్ గా ‘సోగ్గాడే చిన్ని నాయన’ నిలిచింది. తర్వాత దానికి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ వచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నాగార్జునతో కలిసి నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘సంక్రాంతికి సోగ్గాళ్లు’ అనే మరో సినిమా రాబోతున్నట్టు ఈరోజు నాగార్జున పీఆర్ టీమ్ అనౌన్స్ చేసింది.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే.. ఈ సినిమాలో అఖిల్(Akhil Akkineni) కూడా ఓ సోగ్గాడుగా కనిపించనుండటం. అది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ‘బంగార్రాజు’ కథలో రాముకి(చిన నాగార్జునకి) ఒక్కడే కొడుకు. ఆ పాత్రలో చైతన్య చేశాడు. మరి ఇప్పుడు అఖిల్ ఎలా వస్తాడు? ప్రస్తుతానికి ఇది సస్పెన్స్.. ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది.
‘మనం’ తర్వాత అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించింది లేదు. వారిని కలిపి చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అది ‘సంక్రాంతి సోగ్గాళ్ళు’ తో తీరనుంది. ప్రస్తుతం నాగార్జున 100వ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఇందులో కూడా అఖిల్ నటిస్తున్నట్టు ఓ టాక్ ఉంది. చైతన్య కూడా కెమియో ఇచ్చే అవకాశం ఉందట.కానీ ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో కనిపించకపోవచ్చు.2027 సంక్రాంతికి మాత్రం ఆ లోటు తీరిపోనుందన్న మాట.