Anasuya: ‘గాడ్ ఫాదర్’ లో అలా, ‘ఆచార్య’ లో ఇలా..!

స్టార్ యాంకర్ అనసూయ బుల్లితెర పై వడ్డించే గ్లామర్ విందు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘జబర్దస్త్’ వంటి షోలకి ఇంకా మంచి టి.ఆర్.పి నమోదవుతుంది అంటే…అందులో అనసూయ గ్లామర్ కష్టం కూడా ఉందని చెప్పాలి. అయితే మరోపక్క వెండితెర పై కూడా ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సినిమాల్లోకి వచ్చేసరికి ఈమె బలమైన పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది. ‘రంగస్థలం’ లో రంగమ్మత్త పాత్రని చూస్తే.. ఆమెలో అనసూయ కనిపించదు.

Click Here To Watch NOW

రంగమ్మత్తే అన్నట్టు ఆమె ఎమోషన్ ను పండించింది.ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలో కూడా దాక్షాయణి అనే పూర్తి వైవిధ్యమైన పాత్రని పోషించింది. ప్రస్తుతం ఈమె చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మరియు ‘ఆచార్య’ చిత్రాల్లో కూడా నటిస్తుంది.’గాడ్ ఫాదర్’ లో కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న పాత్రని పోషిస్తుంది అనసూయ. అయితే ‘ఆచార్య’లో ఈమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఆచార్య’ లో అనసూయ పాత్ర కొంచెం పవర్ఫుల్ గా ఉంటుందట.

అంతేకాకుండా సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కనబడని కొత్త లుక్ లో అనసూయ కనిపించబోతుంది అని కూడా తెలుస్తుంది. ఆమె మేకోవర్‌ కు సంబంధించిన ఫోటోలు అయితే బయటకి రాలేదు.ఈ మూవీకి అనసూయ పాత్ర కూడా చాలా కీలకమైనదని తెలుస్తుంది. ‘ఆచార్య’ కోసం అనసూయ రూ.25 లక్షల వరకు పారితోషికం అందుకుందట. ‘కొణిదెల ప్రొడెక్షన్స్‌’ తో కలిసి ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ వారు ‘ఆచార్య’ ని నిర్మిస్తున్నారు.

చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా….సెకండ్ హీరోగా సిద్ధ పాత్రని పోషిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘లాహే లాహే’ ‘నీలాంబరి’ ‘సానా కష్టం’ వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్లు కూడా సినిమాపై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus