వీలు చిక్కినప్పుడల్లా విదేశాలకు టూర్లు వేసే అనసూయ.. పెళ్లి రోజు సందర్భంగా టూర్ వేయకుండా ఉంటుందా చెప్పండి. అనుకున్నట్లుగానే చక్కగా బీచ్ ట్రిప్ వేసేసింది. అక్కడ దిగిన రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టించింది. దాంతోపాటు స్పెషల్ డే నాడు తన మనసులోని భావాలను కూడా పోస్టు రూపంలో రాసుకొచ్చింది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. భర్త భరద్వాజ్ గురించి ఆ పోస్టులో చెప్పిన అనసూయ… తనతో ప్రేమ, పెళ్లిపై భావాలను పంచుకుంది.
భర్తతో కలసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో షేర్ చేసిన అనసూయ ఈ మేరకు ఓ పోస్ట్ రాసుకొచ్చింది. ‘‘2001లో నువ్వు నా కోసం రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నీకు రిప్లై ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తాను. ఇన్నేళ్ల మన జీవితంలో ఎంతోమంది నిన్ను ఎన్నో మాటలు అన్నారు. వాటిని పట్టించుకోకుండా నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావు. మన వివాహబంధాన్ని ఎంతో అద్భుతంగా నిలబెడుతున్నావు’’ అని అంది. ‘‘ఇప్పటి వరకు నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు.
ఒక్కోసారి నువ్వు నాపై చూపించే ప్రేమకు, నీ సహనానికి ఆశ్చర్యపోతుంటాను. మనం పర్ఫెక్ట్ కపుల్ కాదని నాకు తెలుసు. కానీ కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడుంటున్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. నన్ను నన్నుగా నీ జీవితంలోకి స్వాగతించినందుకు ధన్యవాదాలు’’ అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను పోస్టు రూపంలో తెలిపింది అనసూయ.
ఇక ఆమె (Anasuya) పోస్టు కింద ఎప్పటిలాగే నెటిజన్ల కామెంట్ల వర్షం కురుస్తోంది. కొందరు పాజిటివ్‌గా రాసుకొస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఆమెను కించపరిచే విధంగా, ఆమెను ఇరిటేట్ చేసే విధంగా పోస్ట్‌లు రాస్తున్నారు. మరి వీటిని చూసి అనసూయ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి. ఒకవేళ స్పందిస్తే మళ్లీ ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది.