Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Focus » Lady Directors: టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?

Lady Directors: టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?

  • May 19, 2023 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lady Directors: టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?

సినిమా ఇండస్ట్రీలో మొదటి నుండి పురుషులదే పై చేయిగా ఉంది. ఇలాంటి రంగంలో ధైర్యంగా, ఎన్నో సవాళ్లు ఎదుర్కోంటూ సత్తా చాటిన మహిళా దర్శకులు ఉన్నారు. చాలామంది మహిళా దర్శకులు సినీ పరిశ్రమలో రాణించారు. ఈ మధ్యకాలంలోనే కాదు ఇండస్ట్రీ తొలి తరం నుండి దర్శకత్వ శాఖలో రాణించిన మహిళలు ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. గౌరీ రోనంకి

గౌరీ రోనంకి 2021 లో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించారు.

2. లక్ష్మీ సౌజన్య

లక్ష్మీ సౌజన్య 2021 లో వచ్చిన ‘వరుడు కావలెను’ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగ శౌర్య, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు.

3. కంగనా రనౌత్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ అనే చిత్రంలో హీరోయిన్ నటించింది. ఆమె 2019 లో మొదటిసారి ‘మణికర్ణిక’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

4. ఘట్టమనేని మంజుల

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మంజుల హీరోయిన్ కావాలని ‘సమ్మర్ ఇన్ బెత్లెహమ్’ అనే మలయాళ మూవీలో నటించింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మంజుల హీరోయిన్ గా చేయకూడదని డిమాండ్ చేయడంతో నిర్మాతగా మారి షో అనే చిత్రాన్ని నిర్మించారు. తొలి మూవీతోనే జాతీయ స్థాయిలో బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. 2018లో మంజుల దర్శకురాలిగా మారి ‘మనసుకు నచ్చింది’ అనే మూవీని రూపొందించారు.

5. రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ హీరోయిన్ గా కొన్ని చిత్రాలలో నటించిన తరువాత కథ రాసుకొని దర్శకురాలిగా మారి 2014 లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మరొక సినిమాకి దర్శకత్వం చేయబోతున్నారు.

6. శ్రీప్రియ

సినియర్ శ్రీప్రియ దర్శకురాలిగా మారి తమిళంలో 2 చిత్రాలకు, కన్నడలో 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో 2014లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించారు.

7. నందిని రెడ్డి

టాలీవుడ్‌లోని మహిళా దర్శకులలో నందిని రెడ్డి ఒకరు. ఆమె 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తరువాత జబర్దస్త్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ, తాజాగా అన్ని మంచి శకునములే చిత్రాలను తెరకెక్కించారు.

8. సుధా కొంగర

కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ పనిచేసిన సుధా కొంగర 2008లో హాస్యనటుడు కృష్ణ భగవాన్ హీరోగా నటించిన ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి జాతీయ స్థాయిలో చాలా అవార్డులు వచ్చాయి.

9. సుచిత్రా చంద్రబోస్

టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ రాణించిన సుచిత్రా చంద్రబోస్ మెగాఫోనే పట్టి 2004లో గౌతమ్, రతి హీరో హీరోయిన్లుగా ‘పల్లకిలో పెళ్లకూతురు’ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

10. బి జయ

బి జయ దర్శకత్వం చేసిన మొదటి సినిమా 2003లో వచ్చిన ‘చంటిగాడు’. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, వైశాఖం లాంటి సినిమాలను రూపొందించారు.

11. రేవతి

సీనియర్ హీరోయిన్ రేవతి తెలుగు, తమిళ , మలయాళ చిత్రాలలో నటించారు. మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత 2002లో దర్శకురాలిగా ‘మిట్ర్ మై ఫ్రెండ్’ తీశారు. ఆ తరువాత ముంబై కటింగ్,కేరళ కేఫ్, సలామ్ వెంకీ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

12. జీవిత రాజశేఖర్

సినియర్ హీరోయిన్ జీవిత తన భర్త రాజశేఖర్ హీరోగా 2002లో శేషు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఎవడైతే నాకేంటి, మహంకాళి, సత్యమేవ జయతే వంటి చిత్రాలకు దర్శకత్వం చేశారు.

13. సావిత్రి

మహానటిగా పేరుగాంచిన సావిత్రి దర్శకురాలిగా మారి తొలిసారి ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.

14. భానుమతి

అలనాటి నటి భానుమతి నిర్మాత, సంగీత దర్శకురాలు, గాయని, రచయిత్రి మరియు స్టూడియో అధినేత్రిగా బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె 1953లో వచ్చిన ‘చండీరాణి’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆమె తన కెరీర్ లో 14 సినిమాలకు దర్శకత్వం వహించారు.

15. విజయనిర్మల

భారతదేశంలో (Lady Directors) డైరెక్షన్ చేసిన హీరోయిన్ అనగానే మొదట వినిపించే పేరు విజయనిర్మల. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల తెలుగు నటి, దర్శకురాలు, నిర్మాత. ఆమె చిత్రాలలో నటించిన సమయంలోనే దర్శకురాలిగా మారి, అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళ గా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ లో స్థానం సంపాదించుకున్నారు. సుమారు 44 చిత్రాలకు దర్శకత్వం చేసిన ఏకైక మహిళగా పేరుగాంచారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #B. V. Nandini Reddy
  • #b.jaya
  • #Director Sudha kongara
  • #Gowri Ronanki
  • #Kangana Ranaut

Also Read

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’… రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’… రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

related news

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

trending news

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

56 mins ago
Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

1 hour ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

7 hours ago
Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

7 hours ago
Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’… రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’… రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

7 hours ago

latest news

Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

9 mins ago
Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

29 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: రిపబ్లిక్ హాలిడే రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి బాగా కలిసొచ్చింది

Mana ShankaraVaraprasad Garu Collections: రిపబ్లిక్ హాలిడే రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి బాగా కలిసొచ్చింది

59 mins ago
Rajinikanth : రజిని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పిన కుమార్తె సౌందర్య

Rajinikanth : రజిని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పిన కుమార్తె సౌందర్య

59 mins ago
Nagarjuna : కింగ్ 100 లో టబు నటిస్తోందా..? నాగార్జున సమాధానం ఏంటంటే..?

Nagarjuna : కింగ్ 100 లో టబు నటిస్తోందా..? నాగార్జున సమాధానం ఏంటంటే..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version