Anchor Jhansi: రెండో పెళ్ళి గురించి ఆసక్తికర వ్యాక్యాలు చేసిన ఝాన్సీ!

  • November 22, 2023 / 08:21 PM IST

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తంపును సంపాదించుకున్న వారిలో ఝాన్సీ ఒకరు. ఈమె ఒకానొక సమయంలో ఇండస్ట్రీలోఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాంకర్ గా కొనసాగారు. ఇలా వరుస సినిమాలో బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి యాంకర్ ఝాన్సీ ఇప్పటికే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలలో నటిస్తూ మేప్పిస్తున్నారు. ఇక ఈమె కెరీర్లు మంచి పొజిషన్లో ఉన్న సమయంలో నటుడు జోగి నాయుడుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత వీరి ఇద్దరి మధ్య ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి. ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే అప్పటికి వీరిద్దరికి ఒక కుమార్తె జన్మించింది. ఇలా కుమార్తె ఆలనా పాలన చూసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఝాన్సీ తాజాగా రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ..

తాను మొదటిసారి పెళ్లి చేసుకుని ఎన్నో ఇబ్బందులు పడ్డానని, మరోసారి పెళ్లి చేసుకొని ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని ఈమె తెలియజేసారు. ఇప్పటికైతే తనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు ఏమాత్రం లేవని ఈమె వెల్లడించారు. ఇక నా మనస్తత్వాన్ని అర్థం చేసుకుని తనంతట తానే ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే తప్పకుండా పెళ్లి గురించి ఆలోచిస్తానని ఈమె  (Anchor Jhansi) తెలిపారు.

ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి తనకు బలం కావాలి తప్ప బలహీనం కాకూడదు. అలాంటి పెళ్లి అయితే నాకు అవసరం లేదు అంటూ ఈ సందర్భంగా ఝాన్సీ కామెంట్స్ చేశారు. తప్పకుండా తనని అర్థం చేసుకునేవాడు దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus