బిగ్‌బాస్‌4: మా ఆయనకు ఐడెంటిటీ ఇవ్వలేదు

లాస్య అనగానే చీమ-ఏనుగు జోక్‌ గుర్తొస్తుంది. నవ్వితే చిన్నపిల్లలా మారిపోతుంది. ఒక్కోసారి వయసుకు మించిన పెద్దరికం చూపిస్తుంటుంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే. మరోవైపు ఆమె జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి.. కన్నీళ్లున్నాయి. తన భర్తను బయట వాళ్లకు భర్తగా పరిచయం చేయడానికి ఆమెకు ఏడేళ్లు పట్టింది. తల్లిదండ్రుల కోపానికి గురైంది. ఇప్పుడు అంతా ఓకే అయ్యింది. అసలు ఆమె లైఫ్‌లో ఏమైందో లాస్య గురువారం చెప్పింది.

‘‘నేను రైతు బిడ్డను. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ గడ్డి కత్తిరించడానికి వెళ్లింది. అక్కడ పురిటినొప్పులు రావడంతో కింద పడిపోయింది. ఎవరో తెలిసినవాళ్లు చూసి ఇంటికి తీసుకెళ్లారు. ప్రసవం చేయించడానికి ఊర్లో వాళ్లు వచ్చారు. తీరా చూస్తే నేను కడుపులో అడ్డం తిరిగాను. దీంతో చాలా జాగ్రత్తగా ప్రసవం చేయించి నన్ను బయటకు తీశారు’’ అంటూ తను పుట్టినప్పుడు జరిగిన విషయాలు చెప్పింది లాస్య.

మా అమ్మ నాన్నను బాధపెట్టాను. కానీ నేను సారీ చెప్పను. మళ్లీ బాధపెట్టకుండా చూసుకుంటాను అని మాటిస్తున్నాను అని చెప్పింది లాస్య. ‘‘మాది చాలా పల్లెటూరు. ఓసారి నాన్న బైక్‌ మీద వస్తుండగా.. కింద పడి పక్కనున్న కొండరాళ్ల మీద పడిపోయారు. ఆ యాక్సిడెంట్‌లో నాన్న ముఖం మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు వైద్యం కోసం అక్కడక్కడా లక్షా 50 వేల రూపాయల వరకు అప్పు చేశాను. బాగా తెలిసినవాళ్లు డబ్బుల దగ్గర వెనుకంజ వేశారు. కానీ కొంతమంది స్నేహితులు నాకు సహకరించారు. అలా నాన్నకు వైద్యం చేయించాను’’ అని చెప్పింది లాస్య.

భర్త మంజునాథ్‌ గురించి చెబుతూ… ‘‘తొలుత మా నాన్నకు మా ఆయన నచ్చలేదు. కానీ ఇప్పుడు మా ఆయన్ని కొడుకులా అనుకుంటున్నాడు’’ అని ఆనందంగా చెప్పింది లాస్య. తర్వాత కెమెరాతో మాట్లాడుతూ భర్తకు సారీ చెప్పింది. ‘‘మాకు పెళ్లైనా ఏడేళ్లవరకు నా భర్తకు ఐడెంటిటీ ఇవ్వలేదు. షూటింగ్స్‌ దగ్గర నన్ను డ్రాప్‌ చేయడానికి వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే కజిన్‌ అనే చెప్పాను. ఇప్పుడు అతని మీద చాలా రెస్పాన్సిబిలిటీస్‌ పెట్టాను. నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే ఇక్కడ ఉంటున్నాను’’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లాస్య.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus