Anchor Pradeep: స్టార్ యాంకర్ వివాదం నుండీ బయటపడినట్టే..!

బుల్లితెర‌ తెర‌ పై స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే సినిమాల్లో కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడు ప్ర‌దీప్ మాచిరాజు. ఈ ఏడాది హీరోగా కూడా మారి హిట్ కూడా కొట్టాడు. స్టేజి పై ఎన్ని పంచ్ లు వేసినా.. హద్దులు దాటకుండా చాలా సెన్సిబుల్ గా డీల్ చేస్తుంటాడు ప్రదీప్. అయితే అతను తాజాగా ఓ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఏది అన్న అంశం పై ప్ర‌దీప్ చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి.ఇటీవల ఓ టీవీ షోలో భాగంగా ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్ర‌దీప్ కామెంట్స్ చేసాడు.

అది కాస్తా వివాదానికి దారి తీసింది.దీని పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాల పై యాంకర్‌ ప్రదీప్‌ ఇలా కామెంట్స్ చేయడం సరికాదని… రైతులు, ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తే.. తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికలపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు.దీంతో ప్ర‌దీప్ వెంటనే రియాక్ట్ అయ్యి తన సోషల్ మీడియా ద్వారా క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ప్ర‌దీప్ మాట్లాడుతూ.. ‘ఎవరినీ కించపరచాలని.. ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో నాకు లేదు.

ఓ ప్రోగ్రాంలో సిటీ పేరు చెప్పి దాని రాజధాని ఏది అని అడిగాను..? నేను అడిగిన ప్రశ్న తప్పు అని కాకుండా అవతలి వ్యక్తి వేరే సమాధానం ఇవ్వడం తో వివాదం ఏర్పడింది. నా వ‌ల్ల ఎవరైనా ఇబ్బంది ప‌డితే ..వారిని మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణలు కోరుతున్నాను. ఇది ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగింది అయితే కాదు’ అంటూ ప్ర‌దీప్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus