బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి యాంకర్ రష్మీ ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకుని వెండితెరపై కూడా బిజీ కాబోతున్నారు. ఇలా బుల్లితెరపై వెండితెరపై కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మూగ జంతువులను హింసించిన వారికి కఠిన శిక్ష పడాలని కోరుతూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు.
అయితే కొన్నిసార్లు రష్మీ చేసే పోస్టులు కారణంగా ఈమెపై భారీగానే ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి ఇలా ఎన్నోసార్లు నేటిజన్స్ చేత ఈమె గొడవ పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి నేటిజన్స్ రష్మిని టార్గెట్ చేశారని తెలుస్తుంది. కోలీవుడ్ నటుడు ఉదయినిది స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనకు తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది వ్యతిరేకత చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే సనాతన ధర్మం గురించి సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చేసినటువంటి పోస్ట్ పై ఈమె రియాక్ట్ అవుతూ హార్ట్ ఎమోజి షేర్ చేశారు. దీంతో నేటిజన్స్ రష్మిని టార్గెట్ చేస్తూ ఆమె పట్ల నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేటిజన్స్ చేసిన కామెంట్లపై రష్మీ (Rashmi) ఘాటుగానే స్పందించారు. నన్ను ఎందుకు టార్గెట్ చేశారు.
నా నమ్మకాలు, నా ఇష్టాల గురించి మీకెందుకు? అయినా నేనెందుకు సిగ్గు పడాలి? ఏమతం సరిగ్గా ఉందో చెప్పండి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఇలా నేటిజన్స్ చేసినటువంటి కామెంట్లపై రష్మీ ఫైర్ అవుతూ కామెంట్లు చేయడంతో నేటిజన్స్ రష్మీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుందనీ చెప్పాలి.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!