Rashmi Gautam: ‘జబర్దస్త్’ షోపై రష్మీ కామెంట్స్!

యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. సుధీర్ తప్పుకోవడంతో ‘శ్రీదేవి డ్రా కంపెనీ’కి సైతం యాంకర్ గా మారింది. రీసెంట్ గా అనసూయ ‘జబర్దస్త్’ షో నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ఎవరొస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. స్రవంతి చొక్కారపును యాంకర్ గా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ‘జబర్దస్త్’ షోకి రష్మీ గౌతమ్ నే యాంకర్ గా తీసుకొచ్చారు.

ఈ విషయాన్ని చెబుతూ రష్మీ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మళ్లీ ‘జబర్దస్త్’ షోలోకి వచ్చినందుకు ఘనంగా స్వాగతం పలికారని.. ఈ సందర్భంగా అందరికీ థాంక్స్ చెప్పారు. ఈ షో కోసం ఎప్పుడూ నిలబడి ఉంటానని, తన వల్ల అయిందంతా చేస్తానని చెప్పుకొచ్చింది. కొత్త వాళ్లు దొరికే వరకు ఇక్కడ హోస్ట్ చేస్తానని.. అది ఎంతో సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చింది. అప్పటివరకు తనను భరించమంటూ ప్లీజ్ చేసింది. నిజానికి కొన్నేళ్లక్రితం అనసూయ ‘జబర్దస్త్’ షోని వదిలి వెళ్లిన తరువాత కొంతకాలం పాటు రష్మీనే షోని నడిపించింది.

ఆ తరువాత కొన్నేళ్లకు అనసూయ మళ్లీ తిరిగొచ్చింది. అప్పట్లో ఈ ఇద్దరు యాంకర్స్ కి పెద్దగా పడేది కాదని చెబుతుంటారు. కానీ తామిద్దరం మాత్రం మంచి ఫ్రెండ్స్ ని చెబుతుంటారు అనసూయ, రష్మీ. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తుంటారు.

జబర్దస్త్ షోకు యాంకర్‌గా అనసూయ, ఎక్స్ ట్రా షోకు రష్మీ పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు అనసూయ బయటకు వెళ్లిపోవడంతో.. తన స్థానంలోకి రష్మీ వచ్చింది. అయితే ఇది టెంపరరీ ఎరేంజ్మెంట్ అని చెబుతోంది రష్మీ. మరి కొత్త యాంకర్ గా ఎవరొస్తారో చూడాలి!

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus