తాజాగా పుల్వామా ఉగ్రవాది దాడిని భారత ప్రజలు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. సుమారు నలభై మందికి పైగా జవానులు ఈ దాడిలో మరణించారు. ఈ సంఘటన ప్రతీ ఒక్కరినీ విషాదానికి గురి చేసింది. ఈ దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని యావత్ భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రూరమైన మనుషులు ఉన్న ప్రపంచంలో మనం బతుకున్నాం… మరో సర్జికల్ స్ట్రైక్ కావలి… వాళ్ళని ఉరి తీయాలి అంటూ మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఇండియాలోనే నివసిస్తూ పాకిస్తాన్ ని పొగుడుతున్న కొందరు వ్యక్తుల పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు కొందరు నెటిజన్లు. ఈ క్రమంలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా అటువంటి వారి పై తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ అయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ… ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ చేసిన ట్వీట్ పై రష్మీ స్పందిస్తూ.. ‘దేశ విభజన సమయంలోనే పాక్ వైపు వెళ్ళాల్సింది .కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు’ అంటూ ఘాటు కామెంట్ పెట్టింది. ఇక మరో నెటిజన్ కూడా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ చేసిన కామెంట్ కి రష్మి…. ”నీ పాకిస్తాన్ గొప్పతనం ఏంట్రా..? సాలే.. మాతోనే మీకు అస్తిత్వం.. మూసుకొని కూర్చో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య” అంటూ అతడిని బూతులు తిట్టి పారేసింది. ఇక రష్మీని సమర్ధిస్తూ చాలా మంది నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.