లాక్ డౌన్ అయ్యాక కానీ కుదరదు: రష్మీ గౌతమ్

రష్మీ .. పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర పై ‘జబర్దస్త్’ వంటి షోలతో తెచ్చుకున్న పాపులారిటీ తో సినిమాల్లో కూడా అవకాశాలు బాగా సంపాదించుకుంది. ‘గుంటూరు టాకీస్’ ‘నెక్స్ట్ నువ్వే’ వంటి సినిమాలు చేసి అలా కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాల్లో కూడా కేవలం గ్లామర్ షోలు మాత్రమే తప్ప తన సహా యాంకర్ మరియు స్నేహితురాలు అయిన అనసూయలా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని మాత్రం చెయ్యలేదు. దీంతో ఈమెకు ఆఫర్లు రావడం లేదు.మళ్ళీ బుల్లితెర పైనే తన హవా కొనసాగిస్తుంది.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి పాపులారిటీ ఎక్కువే..! తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. నెటిజన్లు పెళ్ళి ఎప్పుడు అని ఈమెను ప్రశ్నించారు…”పెళ్లి ఎపుడు చేసుకుంటారు అని ఈమెను ప్రశ్నించగా…. ‘వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి’ అంటూ జవాబు ఇచ్చింది. ‘లాక్ డౌన్‌లో రెండు కిలోల బరువు పెరిగాను. మరోవైపు కొంతమందికి ఆహారం కూడా సప్లై చేస్తున్నాను. సో లాక్ డౌన్ ఉంది అని తెలియడం లేదు’ అని చెప్పింది. మరోవైపు తన బ్రేకప్ విషయమై ఎదురైన ప్రశ్నకు… ‘ఈ విషయం గురించి ఆల్రెడీ చెప్పాను.

పర్సనల్ లైఫ్.. పర్సనల్‌గా ఉండాలి అని. ఇక మళ్లీ సినిమాల్లోకి ఎపుడొస్తారు అనే ప్రశ్నకు.. ‘సరైన స్క్రిప్ట్ ఉంటే సినిమాలు చేస్తాను.ఇక సుధీర్ తో ప్రేమాయణంపై స్పందిస్తూ.. మేమిద్దరం కేవలం కొలీగ్స్ మాత్రమే…! తెరపై ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండాలనే అలా చేస్తున్నాం. మా మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదు. మళ్ళీ టీవీ షోస్‌లో ఎప్పుడు కనిపిస్తారు..చాలా మిస్ అవుతున్నాం అని ఓ నెటిజన్ అడుగగా…. ‘పీ.యం మోడీ గారు.. లాక్ డౌన్ ఎప్పుడు ముగిస్తే అప్పుడు కనిపిస్తా’ అని తెలిపింది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus