అలా ‘ఎక్స్ పోజ్’ చేస్తే తప్పేముంది!!!

  • March 14, 2016 / 10:24 AM IST

బుల్లి తెర హాట్ యాంకర్ రష్మీ ముందు టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే కాలం కలసి రాలేదో, లేకపోతే తాను అనుకున్న పాత్ర తనను వరించలేదో కానీ..మొత్తానికి సినిమాలు గుడ్ బై చెప్పి….టీవీల్లో సెటిల్ అయిపోయింది. ఇక జబర్దస్థ్ షో పుణ్యమా అంటూ టాప్ హాట్ యాంకర్ గా చక్రం తిప్పుతుంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మి నటించిన ‘గుంటూరు టాకీస్’ కు విమర్శలు ఎలా వచ్చినా ఆ సినిమాకు కలెక్షన్స్ బాగా వస్తూ ఉండటంతో మంచి జోష్ పై  ఉంది. ఇక అదే ఊపులో అడిగిన ప్రతీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ…సినిమా ప్రమోషన్ ను బాగానే చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రమోషన్ లో భాగంగా…రష్మీ సినీ ఇండస్ట్రీలో తాను మోస పోయిన విషయాన్ని బయట పెట్టింది. ఆమె మాట్లాడుతూ…సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో తాను మోసపోయానని…తనకు కథ ఒకలా చెప్పి మరొక విధంగా తీయడంతో స్క్రీన్ పై ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలలో తాను నటించవలసిన సందర్భాలు ఎదురు కావడంతో తనకు సినిమా రంగం పైనే విరక్తి కలిగింది అన్న షాకింగ్ కామెంట్స్ చేసింది.

అందుకే ఇండస్ట్రీకి చాలా కాలం దూరంగా ఉన్నాను అని చెప్పింది. మరి గుంటూర్  టాకీస్ చెయ్యడానికి అందులో ఏం నచ్చింది అని అడగగా….దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తనకు ఏ విధంగా కథ చెప్పాడో ఆ విధంగానే తనకు ప్రాధాన్యత ఉండేలా సినిమా తీయడంతో తాను హాట్ సీన్స్ కు అభ్యంతరాలు చెప్పలేదు అని తెలిపింది. ఇక ఎక్స్‌పోసింగ్ పై మీ ఆలోచన ఏంటి అని అడగగా…

ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది…కోట్ల పారితోషికం తీసుకుంటున్న టాప్ హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేస్తూ ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ ఉంటే అటువంటి సీన్స్ చేయడానికి తానెందుకు సిగ్గు పడాలి అంటూనే…..ఎక్స్‌పోసింగ్ అంటే ఆషా మాషీ కాదు అని, దానికి ఎంతో కష్టపడాలి అని చెప్పింది. ఇలా రష్మీ ఒక్క సినిమాకే తనలోని భావాలన్నీ బయటపెట్టేయ్యడంతో అందరూ పాప కాస్త స్పీడ్ గా ఉంది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus