Sreemukhi: ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేసిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సెలబ్రిటీలు ఏం చేస్తుంటారో ఒకోసారి అస్సలు అర్థం కాదు.. సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అన్నట్టే.. ఈమధ్య యాంకర్స్, హీరోయిన్స్ అంతా ఎవరికి వారు మాల్దీవుల్లో ఎంజాయ్ చేశారు.. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. రీసెంట్‌గా టీవీ, సినిమా ఇండస్ట్రీలకు చెందిన సెలబ్స్ వరుసగా గుడ్ న్యూస్‌లు చెప్తూ.. ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.. స్మాల్ స్క్రీన్ స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి కొద్ది రోజుల క్రితం ఇల్లు కట్టబోతున్న సంగతి షేర్ చేసింది..

ఇప్పుడా ఇంటి నిర్మాణం పూర్తయింది.. కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొంది.. సాంప్రదాయం ప్రకారం పూజ, పాలు పొంగించడం వంటివన్నీ చేశారు.. అలాగే అమ్మ, నాన్న, బ్రదర్‌తో కలిసి ఉన్న సెల్ఫీలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది.. ‘కంగ్రాట్స్.. ట్రెడిషనల్ వేర్‌లో చాలా బాగున్నావ్ శ్రీముఖి’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం శ్రీముఖి గృహప్రవేశానికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus