డబ్బు కోసం అలాంటి పనులు చేయను!

  • November 27, 2020 / 01:36 PM IST

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఫేమస్ అయిన ఈ షోకి హయ్యెస్ట్ టీఆర్ఫీ రేటింగులు వస్తుంటాయి. ఈ షోపై విమర్శలు గుప్పించేవారు కూడా ఉన్నారనుకోండి. ఈ లిస్ట్ లో యాంకర్ విష్ణుప్రియా కూడా ఉంది. టీవీ షోలతో బిజీగా గడిపే ఈ బ్యూటీ ఇటీవల బుల్లితెరకి విరామం ఇచ్చి వెండితెరపై అలరించడానికి రెడీ అవుతోంది. ‘చెక్ మేట్’ అనే సినిమాలో నటించింది విష్ణుప్రియ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో బోల్డ్ పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయింది.

ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా సంగతులతో పాటు బిగ్ బాస్ షో గురించి కూడా మాట్లాడింది. బిగ్ బాస్ నాల్గో సీజన్ మొదలుకావడానికి ముందు ఈ షోలో కంటెస్టెంట్ గా విష్ణుప్రియ కనిపించనుందని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా.. షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. తనకి బిగ్ బాస్ షో అంటే అసలు నచ్చదని.. ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ షోకి మాత్రం వెళ్లనని చెబుతోంది.

బిగ్ బాస్ షోలో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఎక్కువగా ఉంటుందని.. ప్రతీవారం హౌస్ నుండి ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పిన విష్ణుప్రియ తన ఉద్దేశం ప్రకారం జీవితంలో ఏ ఒక్కరినీ ఎలిమినేట్ చేయకూడదని చెప్పింది. వీలైతే ప్రేమించాలి కానీ ఎలిమినేట్ చేయకూడదని అంది. కేవలం డబ్బు కోసం అలాంటి పనులు చేయనని.. అందుకే బిగ్ బాస్ షోకి ఫ్యూచర్ లో కూడా వెళ్లనని తేల్చి చెప్పింది. ఒకవేళ వెళ్తే తనను బ్లేమ్ చేయండి అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus