Vishnu Priya: నా విషయంలో అమ్మ సాటిస్ ఫైడ్ కాలేదు!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే బిగ్ బాస్ మానస్ తోకలిసి పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి నటించిన రెండు పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ గా నటిగా ఇండస్ట్రీలో కొనసాగిన విష్ణు ప్రియ ప్రస్తుతం అవకాశాలు లేకనో లేదా మరే కారణాల వల్లనో బుల్లితెరకు దూరమయ్యారు.

అయితే తాజాగా ఈమె మై విలేజ్ షో వారితో కలిసి దావత్ లో పాల్గొన్నారు.ఈ దావత్ లో భాగంగా (Vishnu Priya) విష్ణు ప్రియ సరదాగా తన గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా తాను ఎదుర్కొన్నటువంటి కష్టాలు గురించి కూడా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.అమ్మ నాన్నలది చీరాల, బాపట్ల అని తెలిపారు అయితే తాను చెన్నైలో పుట్టానని తెలియజేశారు. ఇక తాను మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అమ్మ నాన్నలు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని విష్ణు ప్రియ తెలియజేశారు.

పోవే పోరా, నంబర్ వన్ యారీ ఒకే టైంలో ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. నంబర్ వన్ యారీ సమయంలో తాను చాలా సన్నగా ఉన్నానని తెలిపారు. అయితే అలా ఉండడానికి కారణం ఉంది అప్పట్లో సరైన తిండి తినడానికి కూడా డబ్బులు ఉండేది కాదు అంటూ తన కష్టాలను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక తన తల్లి గురించి మాట్లాడుతూ తన తల్లి ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉండేవారని తెలిపారు.తన తల్లి శ్రియ ఆర్తి అగర్వాల్ వంటి హీరోలకు హెయిర్ డ్రెస్సర్ పని చేశారని విష్ణు ప్రియ తెలిపారు.

మా మమ్మీ చాలా టాలెంటెడ్ అలా టాలెంట్ ఉన్న తను హెయిర్ డ్రెస్సర్ గా ఉండకూడదని, తాను ఒక యాక్టర్ వాళ్ళ మమ్మీలా ఉండాలని ఇండస్ట్రీలో తను చాలా కష్టపడుతూ ఇక్కడి వరకు వచ్చాను అయితే తన ఎదుగుదల చూడటానికి మమ్మీ లేరని ఎమోషనల్ అయ్యారు. నా విషయంలో మమ్మీ ఫుల్ సాటిస్ఫైడ్ గా లేరని ఓకేఫీల్ అయిందని ఆ విషయంలో తాను ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నానని ఈ సందర్భంగా తన తల్లిని తలుచుకుంటూ విష్ణు ప్రియ ఎమోషనల్ అయ్యారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus