యాంకర్ విష్ణు ప్రియ అందరికీ సుపరిచితమే. ‘పోవే పోరా’ షో ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ..మొదట ఒకటి రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. ‘చెక్ మేట్’ ‘వాంటెడ్ పండుగాడ్’ వంటి సినిమాల్లో నటించిన విష్ణు ప్రియ ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో అవి బుల్లితెర పై యాంకర్ గా సెటిల్ అయ్యింది. అయినా ఈమెకు సినిమాల్లో రాణించాలనే ఆశ మాత్రం అలాగే ఉంది. అందుకోసమే సోషల్ మీడియాలో విపరీతమైన గ్లామర్ షో చేస్తూ.. వార్తల్లో నిలుస్తోంది.
ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో ఈమె ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంది. పలు బుల్లితెర షోల వేదికల్లో కూడా వీళ్ళు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా విష్ణు ప్రియ ఇంట విషాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే విష్ణు ప్రియ తల్లి అనారోగ్య కారణాలతో నిన్న అంటే జనవరి 26 న మరణించారు అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
విష్ణు ప్రియ ఈ విషయం పై స్పందిస్తూ.. “మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వే నా బలం,నువ్వే నా బలహీనత. నీవు మాతో లేకపోయినా.. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో కూడా నాకు తెలుసు.
అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను..” అంటూ విష్ణు ప్రియా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.విష్ణు ప్రియ తల్లి మృతి చెందింది అని తెలిసిన బంధువులు, స్నేహితులు విష్ణు ప్రియని ఓదారుస్తూ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!