Vishnu Priya Dance: డ్యాన్స్ తో కుమ్మేసిన యాంకర్ విష్ణు ప్రియా!

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం లేడీ యంకర్ గా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో విష్ణు ప్రియా భీమినేని కూడా ఒకరు. కెరీర్ మొదట్లో ఈటివి ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా షో ద్వారా మేల్ యాంకర్ సుధీర్ తో కలిసి అదరగొట్టిన విష్ణు ప్రియా ప్రస్తుతం పలు షోల్లో యాంకరింగ్ అదరగొడుతుండడంతో పాటు అక్కడక్కడా మరికొన్ని షో లకు స్పెషల్ సర్ప్రైజ్ ఎంట్రీ లు ఇస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది.

ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎంతో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియా, తరచూ తన పర్సనల్ విషయాలతో పాటు షోలు, తాను చేసే ఇతర కార్యక్రమాలకు సంబందించిన వీడియోలు, ఫోటో షూట్స్ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల కొన్నాళ్లుగా హాట్ హాట్ ఫోజుల్లో దిగిన ఫోటోలను అప్ లోడ్ చేస్తున్న విష్ణు ప్రియా నేడు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా పర్పుల్ కలర్ లేటెస్ట్ స్టైల్ డ్రెస్ లో డ్యాన్స్ అదరగొట్టిన వీడియో ని పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియోలో తన యద, నడుము అందాలు కనిపించేలా విష్ణుప్రియ చేసిన డ్యాన్స్ అయితే యూత్ ని ఎంతో ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఆ వీడియో పై పలువురు ప్రేక్షకాభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తుండగా, సూపర్ హాట్ గా డ్యాన్స్ చేసావు విష్ణుప్రియ అంటూ మరొక లేడీ యాంకర్ శ్రీముఖి, అలానే ఆర్జే చైతు అయితే ఒకింత ముందడుగు వేసి సూపర్ గా డ్యాన్స్ చేసావు, నీకు ఎంతో ఇష్టమైన అఖిల్ కూడా ఉంటె బాగుండు అంటూ అక్కినేని అఖిల్ కి పెద్ద ఫ్యాన్ అయిన విష్ణు ప్రియని ఆ విషయం గుర్తు చేస్తూ కామెంట్ చేసాడు. మొత్తంగా అందరినీ ఎంతో అలరిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో మరింతగా దూసుకెళ్తోంది.


1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus