Anil Ravipudi: బాలయ్యతో సినిమాపై అనిల్ రావిపూడి కామెంట్స్!

నందమూరి హీరోలు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రాబోతుందని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనీల్ రావిపూడికి ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. అన్ని మీడియా వర్గాల్లో దీని గురించి వార్తలు వచ్చాయి. తనతో మొదటి సినిమా చేసిన కళ్యాణ్ రామ్ అంటే అనీల్ కి ఎంతో అభిమానం. అలానే బాలయ్యతో చాలా కాలంగా సినిమా చేయాలనుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరినీ ఒకే తెరపై చూపించబోతున్నట్లు వార్తలు రావడంతో అందరూ నిజమే అనుకున్నారు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు అనీల్ రావిపూడి. నందమూరి మల్టీస్టారర్ గురించి తాను కూడా మీడియాలో చూసి తెలుసుకున్నానని.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా.. తాను బాలయ్యతో సినిమా చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోన్న సంగతి నిజమేనని.. అయితే ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉందని.. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని చెప్పుకొచ్చాడు.

బాలయ్యతో ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే తనే మీడియాకు చెబుతానని అనీల్ తెలిపాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి చేతిలో ‘ఎఫ్ 3’ సినిమా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గితే వచ్చే నెలలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు చెప్పిన టైమ్ కి సినిమా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus