అనిల్ రావిపూడి ఫాలో అవుతున్న మరో పాయింట్!
- September 15, 2017 / 07:49 AM ISTByFilmy Focus
యువ దర్శకుడు అనిల్ రావి పూడి ఇప్పటికీ చేసింది రెండు సినిమాలు అయినప్పటికీ తనకంటూ ఒక స్టైల్ ఉందని నిరూపించుకున్నారు. టేకింగ్ లోనే కాదు క్యారక్టర్ డిజైనింగ్ లో తన మార్కు చూపించారు. ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్ వాళ్ళను బలవంతంగా చూపించడం ఇతనికి ఇష్టం. పటాస్ లో చెవిటి, మూగ అమ్మాయిని మంచి తెలివితేటలు, సాయం చేసే గుణం ఉన్నట్లు చిత్రీకరించారు. సుప్రీం లో వికలాంగులతో భారీ ఫైట్ చేయించారు. ఇప్పుడు అంధుడిని హీరోగా చేశారు. రవితేజ తో “రాజా ది గ్రేట్” చేస్తున్నారు. ఇందులో హీరో గుడ్డివాడు అయినప్పటికీ మంచి ప్రతిభ గల వ్యక్తిగా డిజైన్ చేశారు. ఈ ఒక్కటే కాదు .. మరో అంశం బయట పడింది. అదేమిటంటే.. తన తొలి సినిమా పటాస్ లో హీరోయిన్ గా నటించిన శృతి సోదితో తన రెండో సినిమా సుప్రీం లో స్పెషల్ సాంగ్ చేయించారు.
అలాగే సుప్రీం లో హీరోయిన్ గా చేసిన రాశీ ఖన్నా తో తన మూడో మూవీ రాజా ది గ్రేట్ లో స్పెషల్ సాంగ్ చేయించారు. ఇలా చేయించడం లక్కీ గా డైరక్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మెహ్రీన్ కి రావిపూడి నెక్స్ట్ సినిమాలో పాట రెడీగా ఉన్నట్లు అర్ధమవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















