Anil Ravipudi: రావిపూడి ప్లాన్ రెడీ.. అనుకున్నట్లే చిరు టార్గెట్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘విశ్వంభర’ (Vishwambhara)  షూటింగ్ పూర్తవ్వడంతో, చిరు తన కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ పవర్ఫుల్ గా ఉంది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) విజయం తర్వాత, మెగాస్టార్ సినిమాతో మరింత గ్రాండ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ దశలోనే భారీ పనులు జరుగుతున్నాయి.

Anil Ravipudi

సాధారణంగా అనిల్ రావిపూడి తన సినిమాల స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే మ్యూజిక్ వర్క్ మొదలుపెడతారు. కానీ ఈసారి, భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ కంపోజ్ చేయడం మొదలుపెట్టారని సమాచారం. ఇప్పటి వరకు నాలుగు పాటలు రెడీ అయ్యాయని, షూటింగ్ మొదలయ్యేలోపే మిగతా మ్యూజిక్ వర్క్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని ఇండస్ట్రీలో టాక్. తాజాగా, అనిల్ రావిపూడి సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, చిరంజీవితో చేయబోయే స్క్రిప్ట్‌ను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనిల్ సినిమాలకు వైజాగ్ ఏరియా స్పెషల్ సెంటిమెంట్ అని, సంక్రాంతి టార్గెట్‌తో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. గతంలో సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో, చిరు సినిమాను కూడా అదే టైమ్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి స్పీడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవితో కూడా ఇదే ప్లానింగ్ ఫాలో చేస్తారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘F3’ (F3 Movie) కూడా తక్కువ టైమ్‌లో పూర్తి చేసిన అనుభవం ఉండటంతో, మెగాస్టార్ సినిమాను అదే రీతిలో కంప్లీట్ చేసి 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మెయిన్ టార్గెట్.

ఇకపోతే, ఈ సినిమాపై అనిల్ రావిపూడికి భారీ అంచనాలే ఉన్నాయి. చిరు ఈజీగా ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయగలరు. ఆ ఎలిమెంట్స్ అన్నీ కలిపి బ్లాక్‌బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు దర్శకుడు స్ట్రాంగ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, చిరంజీవి ఈ సినిమాతో 2026 సంక్రాంతికి భారీ రాబడి కోసం రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

RC16: ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus