మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలంటే ఓ ప్రత్యేకమైన హైప్ ఉంటుంది. ఇప్పుడు అదే స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం విశ్వంభర (Vishwambhara) . వశిష్ట (Mallidi Vasishta) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా, మెగాస్టార్ కెరీర్‌లో ఇదొక విభిన్నమైన ప్రయోగమని టాక్ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో, అభిమానులు థియేటర్‌లో చూడాలనే ఆత్రుతతో ఉన్నారు. అయితే విడుదలైన గ్లింప్స్ సినిమాపై కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది పెంచాయి.
దీంతో గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి లుక్ పూర్తి భిన్నంగా ఉండబోతుందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్, హై లెవెల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం క్లైమాక్స్ పార్ట్‌తో పాటు కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసేసింది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి 95% షూటింగ్ పూర్తయింది. మిగిలినవి కేవలం కొన్ని చిన్న సన్నివేశాలు, ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే.
ఈ పాటను మేకర్స్ భారీగా తెరకెక్కించబోతున్నారు. గతంలో వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ హిట్ అయిన నేపథ్యంలో, ఈ సినిమాకి కూడా అలాంటి పాట ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్‌ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రాఫిక్స్ పనులు గ్రాండ్ లెవెల్‌లో ఉండేలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు.
ఎంఎం కీరవాణి (M. M. Keeravani) అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారనుందని సమాచారం. మొదట సంక్రాంతి 2025లో విడుదల చేయాలనుకున్నా, ప్రస్తుతం సమ్మర్ చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే విడుదల డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.