విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రం రికార్డుల దుమ్ముదులుపుతోంది. దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు వెంకీ. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి హీరోగానూ వెంకీ నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరుసగా 8వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని.. ఎస్ ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) తర్వాత అపజయం అనేది లేని దర్శకుడిగా దూసుకెళ్తున్నాడు.
ఇక ఈ సినిమా ముందు వరకు వరుస ఫ్లాప్స్‌తో సతమతమైన స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజును (Dil Raju) కూడా ఒడ్డున పడేశాడు అనిల్. ఎప్పుడూ మైక్ అందుకోని దిల్‌రాజు సోదరుడు శిరీష్ (Shirish) సైతం అనిల్ రావిపూడి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అలా హీరో, నిర్మాతలు, చిత్ర యూనిట్ మొత్తం ఏ వేదిక మీదకి వెళ్లినా అనిల్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. అలాంటిది ఆయన ఓ విషయంలో తీవ్రంగా బాధపడుతున్నారట.
ఈ ఏడాది జనవరి 23తో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 వసంతాలు పూర్తి చేసుకున్న అనిల్ రావిపూడి.. 8 సినిమాలకు దర్శకత్వం వహించి, 8 విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్‌ను ఎంజాయ్ చేస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అనిల్ రావిపూడి. తాజాగా ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..” ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో మరోసారి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాను.
కానీ ఇన్ని విజయాలు, రికార్డులు, ప్రశంసలు దక్కినా తెలుగు చిత్ర పరిశ్రమలోనూ, మీడియాలోనూ, క్రిటిక్స్ సర్కిల్స్‌లోనూ నాకు అందాల్సినంత రెస్పెక్ట్ దక్కడం లేదు. కానీ కొందరు దర్శకులకు చిన్న విషయానికే కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో పెద్ద ఎలివేషన్ లభిస్తుంది. కానీ ఇంత సాధించినా నాకు అలాంటివి దక్కడం లేదు. కానీ ప్రేక్షకులు మాత్రం నన్ను, నా సినిమాను ప్రేమిస్తున్నారు. అది చాలు. భవిష్యత్తులోనైనా ఆ వర్గాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో చూద్దాం” అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు