బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal) సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాది పూర్తయింది. మొదట ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ టీజర్, ట్రైలర్..వంటివి బయటకొచ్చాక ఈ సినిమాకి ఓ రేంజ్లో బజ్ ఏర్పడింది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 3 గంటల 20 నిమిషాల రన్ టైంని లెక్క చేయకుండా ఆడియన్స్ థియేటర్లకు వెళ్లారు.
సినిమాలో మితి మీరిన బెడ్రూమ్ సీన్స్, ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు వెళ్లడం విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫాదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది కాబట్టి..! ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి కూడా లీడ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. రెండో భాగాన్ని ‘యానిమల్ పార్క్’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు రివీల్ చేశాడు.
రెండో భాగంలో నెక్స్ట్ లెవెల్ వయొలెన్స్ ఉంటుందని కూడా ముందుగానే చెప్పేశాడు సందీప్. అయితే తాజాగా ‘యానిమల్’ గురించి రణబీర్ కపూర్ ఇంకో షాకింగ్ విషయాన్ని కూడా బయటపెట్టాడు. విషయం ఏంటంటే.. ‘యానిమల్’ కి పార్ట్ 2 గా ‘యానిమల్ పార్క్’ మాత్రమే కాదు, మూడో పార్ట్ కూడా వస్తుందట. ‘తనకు కథ చెప్పినప్పుడే ‘యానిమల్’ మూడు పార్టులు ఉంటుంది’ అని చెప్పాడట సందీప్ రెడ్డి వంగా. సో వయొలెన్స్ రెండో పార్ట్ తో మాత్రమే ఆగిపోదు. ఇంకా ఉంటుందని రణబీర్ కపూర్ కామెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.