అసలు అనిరుధ్ అనే సంగీత దర్శకుడిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిందే రజనీకాంత్ అల్లుడు ధనుష్. రజనీకాంత్ కి మేనల్లుడు వరసైన అనిరుధ్ ను “3” చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం చేశాడు ధనుష్. ఆ సినిమా ఫ్లాపైనా, ఆ సినిమా కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన “కొలవరి” పాట మాత్రం వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఆ తర్వాత ధనుష్-అనిరుధ్ ల కాంబినేషన్ లో చాలా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్, సినిమాలు వచ్చాయి. కట్ చేస్తే.. గత కొంతకాలంగా ధనుష్ తన సినిమాల కోసం అనిరుధ్ ను తీసుకోవడం మానేశాడు. “విఐ.పి 2” నుంచి ఈ గోల మొదలైంది. అలాగే.. వరుసబెట్టి శివ-అజిత్ సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న అనిరుధ్ ను తొలగించి తాజా చిత్రం “విశ్వాసం” కోసం డి.ఇమాన్ ను ఫైనల్ చేశారు.
ఇక తమిళనాట ఎలాగూ అచ్చిరావడం లేదనే ఆలోచనతో “అజ్ణాతవాసి”తో తెలుగులోకి అడుగిడాడు. అయితే.. గ్రహచారం బాలేక “అజ్ణాతవాసి” కూడా ఫ్లాప్ అవ్వడంతో.. ముందు ఎనౌన్స్ చేసినట్లుగా ఎన్టీయార్-త్రివిక్రమ్ ల సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఆల్మోస్ట్ చేజారినట్లే. ఈ చిత్రానికి అనిరుధ్ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్ వచ్చాడని విశ్వసనీయ వర్గాల వినికిడి. ఇదేగనుక నిజమైన అటు తమిళంలో క్రేజ్ లేక ఇటు తెలుగులో అవకాశాలు రాక, ఉన్న అవకాశాలు పోయి ఎటూ తేలని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు బక్క మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. మరి ఇతగాడి భవిష్యత్ ఏమిటనేది అనిరుధ్ కి మాత్రమే తెలియాలి.