అంజలి అనగానే ‘హీరోయిన్ అంజలి’ అనుకోకండి ఈమె వేరు. సోషల్ మీడియా జనాలకి ఈమె గురించి పరిచయం అవసరం లేదు. కానీ మిగిలిన వాళ్లకు అవసరం కాబట్టి.. మనం చెప్పుకోబోతున్న బ్యూటీ పేరు అంజలి అరోరా. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ వీడియోస్ తో బాగా పాపులర్ అయ్యింది. కచ్చబాదాం అనే సాంగ్ కి ఈమె చేసిన డాన్స్ మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను తీసుకొచ్చింది.
అందువల్ల ఈమె సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. ఆ తర్వాత ఈమె పాత వీడియోలకు కూడా రీచ్ పెరిగింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు పొందేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు వినికిడి. ఆల్రెడీ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాక్ అప్’ అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అంజలి ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 13.3 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉండటం విశేషం. పాపులర్ హీరోయిన్స్ కి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం కామన్. ఆ రకంగా చూసుకుంటే ఈమె వాళ్ళతో సమానంగా వచ్చేసింది అని చెప్పాలి.
అంజలి అరోరా క్రేజ్ వల్ల పలు స్టేజ్ షోలకు కూడా ఈమెను సంప్రదిస్తున్నారు. థాయిలాండ్ కు చెందిన ఒక క్లబ్‌లో అంజలికి డాన్స్ చేసే అవకాశం దక్కింది. ఇందులో ఆమె చేసిన డాన్స్ హాట్ టాపిక్ అయ్యింది. అక్కడి జనాలు ఈమె డాన్స్ తో ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. పొట్టి డ్రెస్ ధరించి ఈమె వేసిన డాన్స్ కి అక్కడి వారంతా ఫిదా అయిపోయారు అనే చెప్పాలి.