Mahesh Babu, Rajamouli: మల్టీస్టారర్ గా మహేష్ రాజమౌళి మూవీ?

  • August 3, 2021 / 11:24 AM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వచ్చే ఏడాది సమ్మర్ నుంచి మహేష్ తో సినిమాను తెరకెక్కించనున్నారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో నటించాలని మహేష్ బాబు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి పేరు ఉండటంతో రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలని మహేష్ భావిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే మహేష్ రాజమౌళి కాంబో మూవీ తెరకెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కూడా నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరోవైపు మహేష్ పుట్టినరోజున మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో నిజంగా ఈ సినిమాలో నటిస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. గతంలో రాజమౌళి ఒక సందర్భంలో తన తరువాత సినిమాలో మహేష్ మాత్రమే హీరోగా నటిస్తారని చెప్పుకొచ్చారు.

అయితే మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాలేదు కాబట్టి ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెపవచ్చు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. కేఎల్ నారాయణ దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus