బయోపిక్స్ అంటే కేవలం క్రీడా నేపథ్యం మాత్రమే కాదని చెబుతుంటాం. కానీ రియల్ లైఫ్ కథల్ని బయోపిక్స్‌గా చూపించడానికి చాలా ధైర్యం కావాలి. అంతేస్థాయిలో ఆ అంశం/వ్యక్తి మీద పరిశోధన చేసి ఉండాలి. తెలుగులో అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంటాయి… విజయాలు, ప్రశంసలు సాధిస్తుంటాయి. తాజాగా అలాంటి సినిమా ఒకటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అదే ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్. భూమి లేని పేదలకు భూమి ఇవ్వాలన్న సంకల్పంతో మహాత్మ గాంధీ శిష్యుడైన ఆచార్య వినోబా భావే ఆనాడు భూధానోద్యమాన్ని స్థాపించారు.
దాని ద్వారా లక్షల ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచిపెట్టారు. ఈ క్రమంలో వినోబా భావే భూమి అడగ్గానే ప్రథమ భూదాతగా వచ్చిన వ్యక్తి తెలంగాణలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన తన వంద ఎకరాల భూమిని దానంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన జీవిత కథను ఇప్పుడు తెరపైకి తీసుకురాబోతున్నారు.వెర్సటైల్ దర్శకుడి పేరుగాంచిన నీలకంఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వెదిరె రామచంద్రా రెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మావయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయట. త్వరలో నటీనటుల ఎంపిక పూర్తి చేసి… చిత్రీకరణ ప్రారంభిస్తామని చిత్రబృందం చెప్పింది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!