ఆ యువ కథానాయకుడి వివాహబంధం ముగియనుందా

సరిగ్గా 5 రోజుల క్రితం దర్శకుడు క్రిష్ పెళ్లి బంధం కష్టాల్లో ఉందని ప్రచురించి కలకలం సృష్టించిన ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘డెక్కన్ క్రానికల్” మళ్ళీ ఇవాళ ఇంకో స్టార్ మ్యారేజ్ లైఫ్ గురించి “గెస్ హూ” ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది. పేరు మెన్షన్ చేయనప్పటికీ.. ఓ వెటరన్ నటుడి తనయుడు అని, ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడని రాసిన డెక్కన్ క్రానికల్ వారు ఆ హీరో మరెవరో కాదు మంచు మనోజ్ అని చెప్పకనే చెప్పారు. మూడేళ్ళ క్రితం తాను ప్రేమించిన ప్రణతి రెడ్డిని ఇష్టపడి పెళ్లి చేసుకొన్న మంచు మనోజ్ కి ఆ తర్వాత సరైన విజయం లేదు. పర్సనల్ లైఫ్ తోపాటు ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఇబ్బందుల్లో ఉందట.

ఈమేరకు ఇటీవల అమెరికాలో చిన్న సెటిల్ మెంట్ కూడా జరిగిందని, అప్పట్నుంచి మనోజ్ చాలా డిస్టర్బ్ గా ఉంటున్నాడని, అందుకే కొత్త సినిమా కూడా ఏదీ మొదలెట్టలేదని, మోహన్ బాబు మనోజ్-ప్రణతిలు విడాకులు తీసుకోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించకపోవడంతో వేరే దారి లేక ఆయన కూడా మిన్నకుండిపోయాడని తెలుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంత అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేవరకూ ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. మనోజ్ ప్రవర్తన గమనిస్తున్నవారు మాత్రం నిజమే అయ్యుంటుందంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus