‘ఆది పురుష్’ లో మరో స్టార్ హీరో ఫిక్సట..!

‘ఆది పురుష్’ బాలీవుడ్లో ప్రభాస్ స్ట్రైట్ గా నటించబోతున్న చిత్రం. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల కానుంది. ఈ మైతిలాజికల్ డ్రామాని ఏకంగా 500కోట్ల భారీ బడ్జెట్ తో టి.సిరీస్ వారు నిర్మిస్తున్నారు. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రానికి ప్రభాస్ ను హీరోగా తీసుకోవడంతో ఆయన అభిమానులు అలాగే టాలీవుడ్ ప్రేక్షకులు అంతా చాలా హర్షం వ్యక్తం చేసారు. రాముడిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక అతన్ని ఢీ కొట్టే విలన్ లంకేష్(రావణాసురుడు) పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు.

అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోని కూడా ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపిక చేసుకున్నారని వినికిడి. దాంతో ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నాడా అనే కన్ఫ్యూజన్.. టాలీవుడ్ ప్రేక్షకుల్లో మొదలైంది. వారు ఇలాంటి అనుమానం వ్యక్తం చెయ్యడానికి కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. ప్రభాస్ ఈ చిత్రం కోసం 70 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడు.. ఇప్పుడు మరో స్టార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే టాక్ రావడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ‘ఆది పురుష్’ ఎక్కువగా వి.ఎఫ్.ఎక్స్ పైన ఆధారపడిన సినిమా. కాబట్టి చిత్రీకరణ ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్లోనే ఉంటుందట. అందుకే ప్రభాస్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనేది తక్కువ రోజులే అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. ‘ఆది పురుష్’ లో కీలక పాత్రలో కనిపించబోయే నటుడు మరెవరో కాదు.. అజయ్ దేవగన్. ఆయన శివుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. రావణాసరుడు శివుడికి పరమభక్తుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ఆది పురుష్’ లో కూడా శివుడు, రావణుడు మధ్య కొన్ని సీన్లు ఉంటాయట. అందుకే ఆ పాత్రకు అజయ్ దేవగన్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు అని భావించి అతన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.అయితే నిర్మాతలు ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దర్శకుడు ఓం రౌత్ అలాగే అజయ్ దేవగన్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘తానాజీ’ సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus