ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై (Jani Master) నమోదైన లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద ఓ ఫిర్యాదు వచ్చింది. ఇది కూడా లైంగిక వేధింపుల కేసే కావడం గమనార్హం. మొన్నీమధ్యనే ఓ వీడియోలో ‘మాస్టర్‌ది ఏం తప్పు లేదు.. కావాలని ఇరికించారు’ అంటూ ఓ వీడియో వైరల్ అవ్వగా.. ఇప్పుడు ఆ మహిళ తనను లైంగికంగా వేధించింది అంటూ ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు.
Jani Master
జానీ మాస్టర్ కేసులో కీలకంగా ఉన్న అమ్మాయి తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన మామతో హైదరాబాద్, చెన్నైఇతర ప్రాంతాలకు ఔట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు తనను ఆ అమ్మాయి లైంగికంగా వేధించిందని.. నగ్న ఫొటోలు తీసి బెదిరించి లైంగికంగా వేధించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ సమయంలో తాను మైనర్ని అని.. అందుకే అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆ యువకుడు కోరాడు.
దీంతో అసలు ఆ అబ్బాయి కంప్లైంట్ నిజమేనా? ఫిర్యాదులో యువకుడు పేర్కొన్న అంశాలు నిజమేనా? అంటూ చర్చ మొదలైంది. ఎప్పుడో జరిగింది అంటున్న విషయాల విషయంలో సాక్ష్యాలు ఉన్నాయా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో పోలీసులు విచారణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే ఇవి కావాలనే ఆ యువతి మీద మోపుతున్న ఆరోపణలు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఆ మధ్య ఓ కాల్ రికార్డింగ్ ఇలానే బయటకు వచ్చింది. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధిత మహిళ.. జానీ మాస్టర్ డ్రైవర్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అది అని సమాచారం. మాస్టర్‌పై కేసు పెట్టడానికి కారణమేంటి అనేది ఆ వీడియోలో ఆ యువతి చెప్పినట్లు అర్థమవుతోంది. ఇలా రోజుకొక విషయం బయటకు వస్తున్న నేపథ్యంలో ఏది నిజం, ఏది కాదు అనేది తేలడం లేదు. కేసు కోర్టు వరకు వెళ్లి, విచారణ జరిగి విషయం బయటకు రావాలి.