Jani Master: జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌ మీద అల్లుడు ఫిర్యాదు.. లైంగికంగా ఇబ్బంది..!

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై (Jani Master) నమోదైన లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. జానీ మాస్టర్‌ మీద కేసు పెట్టిన ఆ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ మీద ఓ ఫిర్యాదు వచ్చింది. ఇది కూడా లైంగిక వేధింపుల కేసే కావడం గమనార్హం. మొన్నీమధ్యనే ఓ వీడియోలో ‘మాస్టర్‌ది ఏం తప్పు లేదు.. కావాలని ఇరికించారు’ అంటూ ఓ వీడియో వైరల్‌ అవ్వగా.. ఇప్పుడు ఆ మహిళ తనను లైంగికంగా వేధించింది అంటూ ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు.

Jani Master

జానీ మాస్టర్ కేసులో కీలకంగా ఉన్న అమ్మాయి తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన మామతో హైదరాబాద్, చెన్నైఇతర ప్రాంతాలకు ఔట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు తనను ఆ అమ్మాయి లైంగికంగా వేధించిందని.. నగ్న ఫొటోలు తీసి బెదిరించి లైంగికంగా వేధించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ సమయంలో తాను మైనర్‌ని అని.. అందుకే అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆ యువకుడు కోరాడు.

దీంతో అసలు ఆ అబ్బాయి కంప్లైంట్‌ నిజమేనా? ఫిర్యాదులో యువకుడు పేర్కొన్న అంశాలు నిజమేనా? అంటూ చర్చ మొదలైంది. ఎప్పుడో జరిగింది అంటున్న విషయాల విషయంలో సాక్ష్యాలు ఉన్నాయా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో పోలీసులు విచారణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే ఇవి కావాలనే ఆ యువతి మీద మోపుతున్న ఆరోపణలు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఆ మధ్య ఓ కాల్‌ రికార్డింగ్‌ ఇలానే బయటకు వచ్చింది. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధిత మహిళ.. జానీ మాస్టర్ డ్రైవర్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అది అని సమాచారం. మాస్టర్‌పై కేసు పెట్టడానికి కారణమేంటి అనేది ఆ వీడియోలో ఆ యువతి చెప్పినట్లు అర్థమవుతోంది. ఇలా రోజుకొక విషయం బయటకు వస్తున్న నేపథ్యంలో ఏది నిజం, ఏది కాదు అనేది తేలడం లేదు. కేసు కోర్టు వరకు వెళ్లి, విచారణ జరిగి విషయం బయటకు రావాలి.

స్టార్ హీరో మహేష్ ఖాతాలో సూపర్ రికార్డ్.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus