Akhanda Movie: అఖండ నుంచి మరో అదిరిపోయే అప్డేట్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న భారీ సినిమా అఖండ. కొంత గ్యాప్ తరువాత తనకు గతంలో సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో నటసింహం చేస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ రెండు పాత్రలు చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన రెండు టీజర్లు కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుని ఆ అంచనాలు మరింతగా పెంచాయి అని చెప్పకతప్పదు.

ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ విలన్ గా యాక్ట్ చేస్తుండగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి దీనిని ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని సెప్టెంబర్ లో వినాయకచవితి రోజున విడుదల చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా కోసం మొత్తం ఐదు అద్భుతమైన సాంగ్స్ స్వరపరిచారని,

తప్పకుండా సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం అని టాక్. యాక్షన్ తో పాటు మాస్ అంశాలు పుష్కలంగా కలగలిగిన ఈ సినిమా విడుదల తరువాత పెద్ద సక్సెస్ అందుకుంటుందని ఇన్నర్ వర్గాల సమాచారం. కాగా ఈ సినిమా దసరా పండుగా కానుకగా విడుదల కానుందని, త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ బయటకు రానున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus