Ante Sundaraniki Collections: 10 వ రోజు బాగా కలెక్ట్ చేసింది కానీ..!

నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కానీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోతుంది.

ఫస్ట్ వీక్ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ చిత్రం రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.కానీ 10 వ రోజున బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 5.91 cr
సీడెడ్ 1.20 cr
ఉత్తరాంధ్ర 1.54 cr
ఈస్ట్ 0.96 cr
వెస్ట్ 0.82 cr
గుంటూరు 0.89 cr
కృష్ణా 0.87 cr
నెల్లూరు 0.58 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.77 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.53 cr
ఓవర్సీస్ 5.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 19.85 cr

‘అంటే సుందరానికీ!’ చిత్రానికి రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.19.85 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.11.15 కోట్ల షేర్ ను రాబట్టాలి.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోతోంది.కానీ నిన్న 10 వ రోజున ఈ మూవీ సూపర్ గా పెర్ఫార్మ్ చేసింది. ఇదే విధంగా గత వారం పెర్ఫార్మ్ చేసుంటే కనుక బ్రేక్ ఈవెన్ అవకాశం ఉండేది. ప్రస్తుతానికైతే అది చాలా కష్టం అనే చెప్పాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus