నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కానీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోతుంది.
ఫస్ట్ వీక్ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ చిత్రం రెండో వీక్ సో సో గా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
6.12 cr
సీడెడ్
1.25 cr
ఉత్తరాంధ్ర
1.67 cr
ఈస్ట్
1.02 cr
వెస్ట్
0.83 cr
గుంటూరు
0.92 cr
కృష్ణా
0.92 cr
నెల్లూరు
0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
13.33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.59 cr
ఓవర్సీస్
5.67 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
20.59 cr
‘అంటే సుందరానికీ!’ చిత్రానికి రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ రెండు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.20.59 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10.49 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతుంది.
అయితే రెండో వారం రూ..2.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. కొంచెం నిర్మాతలు చొరవ చేసుకుని ప్రమోషన్ చేసి ఉంటే ఇంకా బాగా కలెక్ట్ చేసి ఉండేదేమో.