అందుకే నా పేరు సూర్య థాంక్స్ మీట్ కి రాలేదా?

మెగా హీరోలతో కలిసి ఒక సినిమా చేస్తే చాలు.. ఆ హీరోయిన్ స్థాయి అమాంతం పెరిగిపోతుంది. అందుకే బ్యూటీలు ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అను ఇమ్యానుయేల్ కి ఆ గోల్డెన్ ఛాన్స్ ముందుగానే వచ్చింది. మజ్ను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ… “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో హీరోయిన్ గా నటించింది. దీంతో రెండు సినిమాల్తోనే స్టార్ హీరోయిన్ అయిపోయినందుకు సంబరపడింది. అనేక ఆఫర్లు అందుకుంది. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతా రివర్స్ అయింది. పేరు వస్తుందని అనుకుంటే ఉన్న సినిమాలు కాస్త పోగొట్టింది అజ్ఞాతవాసి. ఇక అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య పై ఆశలు పెట్టుకుంది.

ఇందుకోసం కష్టపడింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతవారం రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అల్లు అర్జున్ ఫైట్స్ గురించి అయినా కొందరు మాట్లాడుకుంటున్నారు కానీ అను గురించి అస్సలు ఎత్తడం లేదు. దీంతో అను తెగ ఫీలయిపోయింది. మెగా హీరోల సినిమాలు తన కెరీర్ కి ప్లస్ అనుకుందంటే మైనస్ అయ్యాయి. అందుకే వారిపై కోపంగా ఉంది. ఆ కోపంతోనే మొన్న జరిగిన నా పేరు సూర్య థాంక్స్ మీట్ కి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ హాజరైనప్పటికీ .. అను ఇమ్యానుయేల్ మాత్రం రాలేదు. ప్రస్తుతం అను ఇమ్యానుయేల్ మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు చేస్తోంది. అక్కినేని నాగచైతన్య కి జోడీగా నటిస్తోంది. ఈ మూవీ అయినా ఆమె కెరీర్ ని పరుగులు పెట్టిస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus