లాయర్ అవతారమెత్తిన అనుపమ పరమేశ్వరన్!

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ కి మాతృ భాషలో కంటే తెలుగులోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. “అ..ఆ” సినిమాతో తెలుగులో పరిచయమైన ఈమె… తర్వాత  ప్రేమమ్, శతమానం భవతి,  ఉన్నదీ ఒక్కటే జిందగీ లతో మరింత దగ్గరయింది. రీసెంట్ గా వచ్చిన “తేజ్‌ ఐ లవ్‌ యూ” సినిమాలోనూ మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం “నేను లోకల్” తో హిట్ ట్రాక్ లో ఉన్న త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తోంది.  “హలో గురు ప్రేమ కోసమే” లో ఎనర్జిటిక్ హీరో రామ్ కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 18 విడుదలకానుంది.

ఈ సినిమాతో పాటు “నటసార్వభౌమ” అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. బాధితుల తరఫున న్యాయం కోసం పోరాడే లాయర్‌గా ఆమె కనిపించనుంది. పవన్‌ వడయార్‌ దర్శకత్వంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. కలకత్తా, బెంగళూరులో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సినిమాలో అనుపమ లుక్‌కు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. అవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరహా రోల్ తొలిసారి చేస్తుండడం వల్ల  “నటసార్వభౌమ”పై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం హిట్ అయితే కన్నడలోను అనుపమ మంచి రోల్స్ అందుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus